వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుతిన్ ప్రత్యర్థిపై విష ప్రయోగం..? అత్యవసరంగా విమానం ల్యాండింగ్... విషమ పరిస్థితిలో అలెక్సీ...

|
Google Oneindia TeluguNews

రష్యా విపక్ష నేత,అవినీతి వ్యతిరేక సంస్థ వ్యవస్థాపకుడు,అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్నీ(44) అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కోమాలోకి వెళ్లిన ఆయన ప్రస్తుతం సైబీరియాలోని ఓ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు. సైబీరీయాలోని టోమ్స్క్ నగరం నుంచి గురువారం(అగస్టు 20) మాస్కోకి తిరుగు పయనమైన అలెక్సీ... విమానంలోనే అస్వస్థతకు గురయ్యారు. ఎయిర్‌పోర్ట్ కేఫ్‌లో ఆయన తాగిన టీలో విష ప్రయోగం జరిగి ఉండవచ్చునని... అందుకే ఆయన కోమాలోకి వెళ్లారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విమానంలో... బాత్‌రూమ్‌లోనే పడిపోయిన అలెక్సీ...

విమానంలో... బాత్‌రూమ్‌లోనే పడిపోయిన అలెక్సీ...

అలెక్సీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విమానాన్ని అత్యవసరంగా ఒమ్స్క్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానంలో ఉన్నట్టుండి అలెక్సీ శరీరమంతా ఒక్కసారిగా చెమటలు పట్టాయని... ఆయన స్థాపించిన అవినీతి వ్యతిరేక సంస్థ ప్రతినిధి కిరా యర్‌మిష్ తెలిపారు. స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపించడంతో... తనతో మాట్లాడుతూనే ఉండాలని... తద్వారా ఆ గొంతును వినడం పైనే తాను ఫోకస్ చేయగలనని అలెక్సీ చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అలెక్సీ వాష్‌రూమ్‌కి వెళ్లారని... అక్కడే కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్లారని తెలిపారు.

టీ ద్వారా విష ప్రయోగం...?

టీ ద్వారా విష ప్రయోగం...?

అలెక్సీపై ఉద్దేశపూర్వకంగానే తీవ్ర విష ప్రయోగం జరిపారని కిరా యర్‌మిష్ ట్విట్టర్‌లో ఆరోపించారు.ఆయన సేవించిన టీలో విష పదార్థాలు కలిపినట్లుగా అనుమానిస్తున్నామన్నారు. వేడి పానీయం ద్వారా విష పదార్థాలు త్వరగా శరీరమంతా వ్యాపిస్తాయని వైద్యులు చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కోమాలో ఉన్న అలెక్సీకి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. అలెక్సీ భార్య యులియా నవల్నయా ఆస్పత్రికి చేరుకున్నట్లు తెలిపారు. మొదట ఆమెను ఆస్పత్రి సిబ్బంది అనుమతించనప్పటికీ... ఆ తర్వాత అనుమతించినట్లు చెప్పారు.

విషమ పరిస్థితిలో...

విషమ పరిస్థితిలో...

అలెక్సీ సన్నిహితుడైన వ్లాదిమిర్ మిలోవ్ పుతిన్ పైనే అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ దీని వెనకాల పుతిన్ ఉంటే అంతకన్నా దారుణం ఉండదన్నారు. ప్రస్తుతం అలెక్సీ చికిత్స పొందుతున్న ఒమ్స్క్ ఎమర్జెన్సీ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ అలెగ్జాండర్ మురాఖోవ్‌స్కీ మాట్లాడుతూ... ఆయన పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు. అయితే ఆస్పత్రి డిప్యూటీ హెడ్ అంటోలీ మాత్రం అలెక్సీ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పడం గమనార్హం. అయితే విష ప్రయోగం జరిగింది లేనిది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమన్నారు.

Recommended Video

: Fact Check : Did Putin’s Daughter Die After Taking COVID-19 Vaccine?
అందుకే టార్గెట్ అయ్యాడా...?

అందుకే టార్గెట్ అయ్యాడా...?

అలెక్సీ నావల్నీ స్థాపించిన అవినీతి వ్యతిరేక సంస్థ రష్యాలోని ప్రభుత్వ అధికారుల అవినీతిని బయటపెడుతోంది. ప్రభుత్వంలో ఉన్న పలువురు ఉన్నతాధికారుల అవినీతిని కూడా ఈ సంస్థ బయటపెట్టింది. అధ్యక్షుడు పుతిన్‌కు కూడా అలెక్సీ కొరకరాని కొయ్యగా మారారన్న వాదన ఉంది. అవినీతి ఆరోపణలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుండటంతో... పుతిన్ కూడా ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో అలెక్సీ పలుమార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. పుతిన్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఎదుగుతున్నందుకే ఆయన టార్గెట్ అయ్యారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

English summary
The Russian opposition leader Alexei Navalny was in intensive care in a Siberian hospital on Thursday after he fell ill in what his spokeswoman said was a suspected poisoning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X