వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలీబాబా నుంచి జాక్ మా రిటైర్మెంట్, కానీ: కారణాలివే!! అతని ప్రత్యేకతలెన్నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

అలీబాబా సంస్థ కి రాజీనామా చేయనున్న జాక్ మా

బీజింగ్: ప్రఖ్యాత అలీబాబా సంస్థ సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా త్వరలో రిటైర్ కానున్నారు. అలీబాబా ప్రతిష్టాత్మక ఈ కామర్స్ సంస్థ. దీని నుంచి తాను తప్పుకోవాలని అనుకుంటున్నానని జాక్ మా వెల్లడించారు. ఇది 420 బిలియన్ డాలర్ల విలువైన ఈ కామర్స్ సంస్థ.

మైకేల్ పాటకు బిలియనీర్ జాక్ మా డ్యాన్స్: హోరెత్తించారు(వీడియో)మైకేల్ పాటకు బిలియనీర్ జాక్ మా డ్యాన్స్: హోరెత్తించారు(వీడియో)

జాక్ మా ఈ సంస్థను ప్రారంభించకముందు ఇంగ్లీష్ టీచర్. 1999 అంటే.. దాదాపు రెండు దశాబాద్దాల క్రితం అలీబాబాను స్థాపించారు. అలీబాబా ఈ కామర్స్ కంపెనీని అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లారు. అలీబాబా ఈ కామర్స్ బిజినెస్‌లోనే కాకుండా డిజిటల్ పేమెంట్ కంపెనీగా కూడా అత్యున్నత శిఖరానికి చేరుకుంది.

అత్యంత ధనవంతుడు, చైనీయులు ఆరాదిస్తారు, పూజిస్తారు

అత్యంత ధనవంతుడు, చైనీయులు ఆరాదిస్తారు, పూజిస్తారు

చైనీయులు ఎక్కువమంది అలీబాబా ద్వారానే షాపింగ్ చేసే పరిస్థితి, పేమెంట్స్ చేసే పరిస్థితి ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా మరో కంపెనీ లేదని చెప్పవచ్చు. అలీబాబా వ్యవస్థాపకుడు అయిన జాక్ మా నికర విలువ 40 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. దీంతో అతను చైనాలోనే అత్యంత ధనవంతుడుగా నిలిచాడు. చైనీయులు అందరూ ఇతనిని ఎంతో ఆరాదిస్తారు. ఇళ్లలో ఇతని ఫోటోలు పెట్టుకొని పూజించేవారు కూడా ఉన్నారు.

 అందుకే రిటైర్మెంట్

అందుకే రిటైర్మెంట్

బీజింగ్, ప్రభుత్వ సంస్థలు కీలకంగా మారుతున్నందున, చైనాలో తాజా బిజినెస్ పరిస్థితుల నేపథ్యంలో జాక్ మా తప్పుకుంటున్నారని తెలుస్తోంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నేతృత్వంలో చైనా ఇంటర్నెట్ ఇండస్ట్రీ క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వం తన పట్టును బిగిస్తోంది.

 అమెరికాతో ట్రేడ్ వార్

అమెరికాతో ట్రేడ్ వార్

అలాగే, చైనా ఆర్థిక వ్యవస్థ మందగిసతోంది. డెబిట్ పెరుగుతోంది. అలాగే అమెరికాతో ట్రేడ్ యుద్ధం చేస్తోంది. ఇన్ని పరిణామాల మధ్యలో జాక్ మా కంపెనీ నుంచి తప్పుకుంటున్నారని తెలుస్తోంది.

బోర్డులోనే జాక్ మా, మెంటర్‌గాను, చైనాలో టీచర్స్ డే

బోర్డులోనే జాక్ మా, మెంటర్‌గాను, చైనాలో టీచర్స్ డే

ఓ ఇంటర్వ్యూలో జాక్ మా మాట్లాడుతూ.. రిటైర్మెంట్ అంటే అధ్యాయం ముగిసిపోవడం కాదని తేల్చి చెప్పారు. కొత్త శకం ప్రారంభం అన్నారు. విద్య పైన దృష్టి సారిస్తానని ఆయన తెలిపారు. తనకు విద్య అంటే చాలా ఇష్టమని చెప్పారు. అయితే జాక్ మా అలీబాబా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఉంటారు. కంపెనీ మేనేజ్‌మెంట్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తారు. జాక్ మాకు సోమవారం (10-09-2018) 54 ఏళ్లు వస్తాయి. ఆయన పుట్టిన రోజు చైనాలో టీచర్స్ డేగా పాటిస్తారు. ఆ రోజు సెలవుదినం.

English summary
Alibaba’s co-founder and executive chairman, Jack Ma, said he planned to step down from the Chinese e-commerce giant on Monday to pursue philanthropy in education, a changing of the guard for the $420 billion internet company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X