వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దట్ ఈజ్ మోడీ.. జీ7 దేశాధినేతల ముందే కాశ్మీర్‌ విషయంలో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని ప్రకటన

|
Google Oneindia TeluguNews

పారిస్ : కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ యవనికపై తన వాణిని వినిపించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ముందు .. జీ 7 దేశాధినేతల సమక్షంలో సుందర కశ్మీర్ తమదేనని తేల్చిచెప్పారు. కశ్మీర్ అంశంపై వెనక్కి తగ్గబోమని మరోసారి తేల్చిచెప్పారు ప్రధాని మోడీ. కశ్మీర్‌ ఇష్యూపై మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని తీసుకోబోమని స్పష్టంచేశారు. పెద్దన్న ట్రంప్ ఎదురుగా .. జీ 7 ప్రతినిధుల సమక్షంలో బలంగా మోడీ తన వాణిని వినిపించారు.

 మధ్యవర్తిత్వానికి నో

మధ్యవర్తిత్వానికి నో

వివిధ అంశాలపై పాకిస్థాన్‌తో చర్చించేందుకు సిద్ధమని మోడీ స్పష్టంచేశారు. తమ సమస్యలను ద్వైపాక్షికింగా పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. కశ్మీర్ అంశంపై చర్చలకు మూడో దేశం కలుగజేసుకునేందుకు తావులేదని తేల్చిచెప్పారు. ట్రంప్ ఎదురుగా మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తించాయి. కశ్మీర్ అంశంపై తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ ఇదివరకే పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ వేదికపై మోడీ ఘాటుగా సమాధానం ఇచ్చారు. కశ్మీర్ అంశానికి సంబంధించి మూడో దేశం జోక్యాన్ని సహించబోమని తేల్చిచెప్పారు.

రెండుగా విడిపోయిన దేశం

రెండుగా విడిపోయిన దేశం

1947కు ముందు భారత్, పాకిస్థాన్ ఓకే దేశమని .. తర్వాత వీడిపోయాయని గుర్తుచేశారు. కశ్మీర్ అంశానికి సంబంధంచి పాకిస్థాన్ అభ్యంతరాలపై చర్చించేందుకు సిద్ధమని తేల్చిచెప్పారు. అయితే మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని సహించబోమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం కశ్మీర్‌లో పరిస్థితి అదుపులో ఉందని తెలిపారాయన. తమకు అమెరికా మంచి భాగస్వామ్య దేశమని .. కానీ తమ అంతరంగిక విషయాల్లో కల్పించుకోవాలని చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. తమ సమస్యను తామే పరిష్కరించుకుంటామని తేల్చిచెప్పారు.

మోడీ వాదన

మోడీ వాదన

కశ్మీర్ విభజన కన్నా ముందు ట్రంప్ .. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పారు. తనను మిడియేటేషన్ చేయమని మోడీ చెప్పారని గుర్తుచేశారు. అయితే దీనిపై ఇంటా బయట సర్వత్రా విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వ్యుహాత్మకంగా అడుగులు వేసింది. కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు చేసింది. కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేసింది. 40 వేల మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లను మొహరించి పరిస్థితిని పర్యవేక్షించింది. ఈ క్రమంలో పాకిస్థాన్ నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ సందర్భంగానే ప్యారిస్‌లో జీ7 సభ్యదేశాల సమావేశం జరుగుతుంది. సదస్సులో అమెరికా అధినేత ట్రంప్, భారత ప్రధాని మోడీ ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి కశ్మీర్ అంశం తెరపైకి రాగా .. మోడీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

English summary
“All issues between India and Pakistan bilateral. Don’t want to give pain to any third country. We can discuss and resolve all issues bilaterally,” PM Modi told Trump on the sidelines of the G-7 Summit in the French town of Biarritz.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X