వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొసలి! ఇంటికే వచ్చి కాలింగ్ బెల్ కొడితే..(వీడియో)

|
Google Oneindia TeluguNews

సౌత్‌కెరోలినా: ఎవరైనా అతిథులుగా ఇంటికి వస్తే కాలింగ్ బెల్ కొట్టి పిలుస్తారు. కానీ, అనుకోని అతిథి వచ్చి కాలింగ్ బెల్ కొడితే? అది కూడా ఓ పెద్ద మొసలి(అలిగేటర్) అయితే.. ఇంకేముందు గుండెజారి గల్లంతవ్వాల్సిందే.

అమెరికాలోని సౌత్ కరోలినాలోని ఓ మడుగు నుంచి జనావాసంలోకి వచ్చిన ఎలిగేటర్ (పెద్ద మొసలి) ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఎంతో అలవాటున్న చుట్టంలా నేరుగా డోర్ దగ్గరకెళ్లి కాలింగ్ బెల్ కొట్టింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో డోర్ తెరుచుకోలేదు.

ఆ సమయంలో పొరపాటున ఎవరైనా ఉండి, డోర్ తెరిచి ఉంటే దారుణం చోటుచేసుకుని ఉండేది. ఈ తతంగాన్నంతా ఆ ఇంటి పక్కనుండే ఓ వ్యక్తి షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

 alligator

కాగా, అలిగేటర్‌(మొసలి) చాలా హాయిగా ఇంటి చుట్టూ నడిచి డోర్‌ దగ్గరికి వెళ్లి బెల్‌కొట్టబోయిందని వీడియో తీసిన గారీ రోగర్స్‌ తెలిపారు. రెండు ఇళ్ల చుట్టూ అలాగే తిరిగిందని.. ఆ ఇళ్ల చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ కారణంగా దారి తప్పి ఒకటికి రెండు సార్లు చుట్టూ తిరిగిందని చెప్పారు.

అలిగేటర్‌ కాస్త దగ్గరికి వచ్చేసరికి వీడియో తీయడం ఆపేశానని.. సమీపంలోకి వచ్చినా అలిగేటర్‌ ఏమాత్రం ఆగ్రహం ప్రదర్శించలేదన్నారు. ఇది చాలా మర్యాదగల అలిగేటర్‌ అనుకుంటా.. అంటూ నవ్వాడు.

కాగా, ఒకప్పుడు ఈ అలిగేటర్ల జాతి అదృశ్యమైపోతోందని అమెరికా ప్రభుత్వం సంరక్షణ చర్యలు చేపట్టింది. ఆ చర్యలు ఫలించి ఇప్పుడు వాటి సంతతి బాగా పెరిగింది. ఒక్క సౌత్‌ కెరోలినాలోనే లక్ష దాకా అలిగేటర్లు ఉన్నాయి. దాంతో అవి జనావాసాలవైపు రావడం తరచుగా జరుగుతోంది.

English summary
The surprising animal encounter was filmed by Gary Ridge when he was out walking his dog near his home in South Carolina.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X