వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైండ్ బ్లాక్ అవుతుంది: ఆల్ఫాబెట్ సీఈఓగా సుందర్ పిచాయ్ వేతనం ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

శాన్‌ఫ్రాన్సిస్కో: గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సుందర్ పిచాయ్ ఏడాది వేతనం ఎంతో తెలుసా..? మొన్నటి వరకు గూగుల్ సీఈఓగా ఉన్న పిచాయ్ ఈ మధ్యే కొత్తగా ఆల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన వేతనం ఎంతుంటుందనేదానిపైనే సర్వత్రా చర్చజరుగుతోంది. అయితే పిచాయ్ వేతనంపై శుక్రవారం ఓ క్లారిటీ వచ్చేసింది.

మూడేళ్లకు స్టాక్ ప్యాకేజ్‌ను ప్రకటించిన ఆల్ఫాబెట్

మూడేళ్లకు స్టాక్ ప్యాకేజ్‌ను ప్రకటించిన ఆల్ఫాబెట్

గూగుల్‌తో పాటు ఆల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సుందర్ పిచాయ్‌కు ఆసంస్థ రానున్న మూడేళ్లకు గాను స్టాక్ ప్యాకేజ్‌ను ప్రకటించింది. మూడేళ్లకుగాను అక్షరాల 240 మిలియన్ అమెరికాన్ డాలర్ల ప్యాకేజ్‌ను తీసుకోనున్నారు. అంటే ఇది మన భారత కరెన్సీలో రూ.1,707 కోట్లుగా ఉంది. ఇక ఏడాదికి 2 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.14 కోట్లు వేతనంగా పొందనున్నారు. కొత్త ప్యాకేజ్ 2020నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. గూగుల్ సంస్థ పర్ఫార్మెన్స్‌ ఆధారంగా స్టాక్ ప్యాకేజ్‌లను ప్రకటించడం ఇది తొలిసారి కావడం విశేషం.

ఈ నెల ప్రారంభంలో ఆల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలు

ఈ నెల ప్రారంభంలో ఆల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలు


సిలికాన్ వ్యాలీలో అత్యధిక వేతనం పొందుతున్న వారిలో ఇప్పటికే పిచాయ్ ఉన్నారు. 2015 నుంచి గూగుల్ సీఈఓగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.గతేడాది అతని వేతనం 1.8 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. దీనికి ముందు పిచాయ్ ఏడాదికి రూ. 6,50,000 వేల డాలర్లు సంపాదించేవారని నివేదిక వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో గూగుల్ సహవ్యవస్థాపకులు లారీ పేజ్ మరియు సర్జి బ్రిన్‌లు స్వతంత్రంగా తప్పుకోవడంతో సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ బాధ్యతలను స్వీకరించారు.

 2016లో కూడా స్టాక్ అవార్డులను పొందిన సుందర్

2016లో కూడా స్టాక్ అవార్డులను పొందిన సుందర్


ఇలా స్టాక్ అవార్డులు పొందడం సుందర్ పిచాయ్‌కు కొత్తేమి కాదు. 2016లో స్టాక్ అవార్డుల కింద 200 మిలియన్ డాలర్లను సుందర్ పిచాయ్ అందుకున్నారు. అయితే గతేడాది కూడా గ్రాంట్ ప్రకటన చేయగా ఇప్పటికే కంపెనీ తనకు చాలా ఎక్కువ వేతనం ఇస్తోందని చెబుతూ నిరాకరించారని అతని సన్నిహితులు చెబుతారు. 2018లో తనకు 1.9 మిలియన్ డాలర్లను కంపెనీ ఇచ్చినట్లు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది.

 సుందర్ పిచాయ్ వేతనంపై గతంలో విబేధాలు

సుందర్ పిచాయ్ వేతనంపై గతంలో విబేధాలు

ఇదిలా ఉంటే సుందర్ పిచాయ్‌కు ఎందుకు అంత వేతనం ఇస్తున్నారని ఒక సమావేశంలో గూగుల్‌లో పనిచేసే ఉద్యోగి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అంతేకాదు చాలా మందికి వేతనాలు తక్కువగానే ఉన్నాయని ఆ ఉద్యోగి సమావేశంలో చెప్పారు. దీంతో కంపెనీలో ఏదో వివాదం నడుస్తోందని అప్పట్లో అంతా భావించారు. రాను రాను ఆ యాజమాన్యం ఉద్యోగస్తుల మధ్య విబేధాలు రావడం అంతర్గతంగా నిరసనలు తెలిపే వరకు వెళ్లాయి.

English summary
The new Alphabet Inc. chief executive officer will receive $240 million in stock awards over the next three years if he hits all of his performance targets, as well as a $2 million annual salary beginning in 2020, the firm said Friday in a filing
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X