వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్...కీలక సమాచారం కోసమే ఆ దేశ రాజు హ్యాకింగ్ చేశారా..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Jeff Bezos hack : Saudi Crown Prince Hacked Jeff Bezos's Phone || Oneindia Telugu

వాషింగ్టన్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకులు, ప్రపంచపు అత్యంత ధనవంతుడైన జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాకింగ్‌కు గురైన అంశం వెలుగు చూసింది. 2018లో తన ఫోన్ హ్యాకింగ్‌కు గురైనట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక గార్డియన్ కథనాన్ని ప్రచురించింది. సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్ నుంచి జెఫ్ బెజోస్‌కు వెళ్లిన ఓ వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇది హ్యాకింగ్‌కు గురైనట్లు గుర్తించడం జరిగింది.

వాట్సాప్ మెసేజ్‌లో వైరస్

వాట్సాప్ మెసేజ్‌లో వైరస్

సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్‌ పంపిన వాట్సాప్ మెసేజ్‌లో వైరస్ ఉందని ఆ వైరస ద్వారా జెఫ్ బెజోస్ వ్యక్తిగత సమాచారం హ్యాక్ అయ్యిందని డిజిటల్ ఫోరెన్సిక్ అనాలిసిస్ నివేదిక వెల్లడించినట్లు గార్డియన్ తన కథనంలో రాసుకొచ్చింది. అయితే జెఫ్ బెజోస్ ఫోన్ నుంచి ఎలాంటి సమాచారం హ్యాకింగ్‌కు గురైందో స్పష్టంగా చెప్పలేదు. గతేడాది జెఫ్ బెజోస్ అతని భార్య మెకెంజీలు తమ 25 ఏళ్ల వైవాహిక బంధంకు గుడ్‌బై చెప్పడం వెనక కూడా ఉన్న కారణం హ్యాకింగ్‌తో ముడిపడి ఉందని సమాచారం.

 ఒకరి నెంబర్ ఒకరు మార్చుకున్న బెజోస్..సౌదీ యువరాజు

ఒకరి నెంబర్ ఒకరు మార్చుకున్న బెజోస్..సౌదీ యువరాజు

సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్ - జెఫ్ బెజోస్‌లు ఇద్దరూ డిన్నర్‌కు కలిశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం చిగురించడంతో ఒకరి ఫోన్ నెంబరు మరొకరు ఇచ్చిపుచ్చుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత బెజోస్‌కు మొహ్మద్ బిన్ సల్మాన్ ఓ వీడియో మెసేజ్‌ను పంపినట్లు తెలుస్తోంది. మే 1,2018లో జెఫ్ బెజోస్‌ ఫోన్‌కు ఈ వీడియో మెసేజ్ వచ్చినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను తమ దేశంలో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా ఆ సమయంలో సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్ ప్రయత్నాలు సాగిస్తున్న క్రమంలో ఈ వీడియో పంపడం జరిగిందని తెలుస్తోంది.

హ్యాకింగ్‌తోనే బెజోస్‌ వివాహేతర సంబంధం వెలుగులోకి..?

హ్యాకింగ్‌తోనే బెజోస్‌ వివాహేతర సంబంధం వెలుగులోకి..?

ఇక హ్యాకింగ్ వెనక కచ్చితంగా సౌదీ యువరాజు హస్తం ఉండి ఉంటుందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇక ఇది నిజమని తేలితే సౌదీలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న ఇన్వెస్టర్లపై ప్రభావం చూపి వారు వెనక్కు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు బెజోస్ వ్యక్తిగత జీవితంలో కూడా పలు కుదుపులు రావడం వెనక ఫోన్ హ్యాకింగ్‌కు గురికావడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. తన వ్యక్తిగత మెసేజ్‌లను నేషనల్ ఎంక్వైరర్ అనే పత్రిక బయటపెట్టడంతో బెజోస్ వివాహేతర సంబంధం కలిగి ఉన్నారన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీంతో తన భార్య మెకంజీతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.

హ్యాకింగ్ వార్తలను కొట్టిపారేసిన సౌదీ ఎంబసీ

బెజోస్ ఫోన్ హ్యాకింగ్‌ వెనక సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉందని వస్తున్న ఆరోపణలపై అమెరికాలోని సౌదీ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పింది. వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. మొహ్మద్ బిన్ సల్మాన్‌‌కు హ్యాకింగ్ చేయాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చింది.

English summary
Amazon founder and Chief Executive Officer (CEO) Jeff Bezos mobile phone was hacked in 2018 after receiving a WhatsApp message which was apparently received from the personal account of Crown Prince of Saudi Arabia, Mohammad bin Salman, The Guardian reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X