వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాకు మరో షాకిచ్చిన అమెరికా: వెయ్యిమందికిపైగా చైనీయుల వీసాల రద్దు, అదే కారణం!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/బీజింగ్: చైనాకు అమెరికా మరో భారీ షాకిచ్చింది. ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా చైనీయుల వీసాలను రద్దు చేసినట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగశాఖ వెల్లడించింది. మే నెలలో అమెరికా అధ్యక్షుడి ప్రకటన ఆధారంగా ఈ వీసాల రద్దు చేసినట్లు తెలిపింది.

చైనా మిలిటరీకి యూఎస్ సమాచారం

చైనా మిలిటరీకి యూఎస్ సమాచారం

చైనా నుంచి అమెరికాకు వస్తోన్న విద్యార్థులు, పరిశోధకులకు చైనా మిలటరీతో సంబంధాలు కలిగి ఉండి, అమెరికాకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని డ్రాగన్ ఆర్మీకి చేరవేస్తున్నారనే అనుమానంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్ చాడ్ వోల్ఫ్ స్పష్టం చేశారు. చట్టవ్యతిరేక వ్యాపార పద్ధతులు, గూఢచర్యం పేరుతో అమెరికా మేధో సంపత్తితోపాటు కరోనా పరిశోధనా సమాచారాన్ని తస్కరించేందుకు విద్యార్థి వీసాలను చైనా దుర్వినియోగం చేస్తోందని వాల్ఫ్ ఆరోపించారు.

అలాంటి వారికి ఆహ్వానమే

అలాంటి వారికి ఆహ్వానమే

అయితే, ఇలాంటి ప్రమాదం పొంచివున్న విద్యార్థుల సంఖ్య తక్కువేనని, ఇక్కడి చట్టాలకు లోబడి వచ్చే వచ్చే విద్యార్థులు, పరిశోధకులకు అమెరికా ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని తెలిపారు. కాగా, అమెరికాలో దాదాపు 3.60 లక్షల మంది చైనీయులు విద్యనభ్యసిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ ప్రకటన మేరకే..

డొనాల్డ్ ట్రంప్ ప్రకటన మేరకే..

హాంగ్‌కాంగ్‌లో చైనా ఆగడాలను అరికట్టే చర్యల్లో భాగంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెలువరించిన ప్రకటన కింద ఈ వీసా రద్దు చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. అంతేగాక, వెట్టిచాకిరీతో ఉత్పత్తి చేసిన వస్తువులను ఇకపై తమ దేశ మార్కెట్లోకి రాకుండా అడ్డుకుంటామంటూ.. జిన్‌జియాంగ్‌లోని ఉగర్ ముస్లిం పట్ల చైనా అనుసరిస్తున్న వైఖరిని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అమెరికా వర్సెస్ చైనాలా..

అమెరికా వర్సెస్ చైనాలా..

గత కొద్ది నెలలుగా అమెరికా-చైనా మధ్య దౌత్యపరమైన, వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇక కరోనా మహమ్మారిని ప్రపంచంపైకి పంపిందంటూ ఇప్పటికే చైనాపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా, చైనాల మధ్య అన్ని రకాలుగా సంబంధాలు తెగిపోయాయి. ఒక దేశంపై మరో దేశం విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక చైనా కంపెనీలపైనా అమెరికా కఠిన ఆంక్షలను విధిస్తోంది. తాజాగా, తమ దేశ భద్రతకు ముప్పు అంటూ వెయ్యి మందికిపైగా చైనీయుల వీసాలను రద్దు చేయడం గమనార్హం.

English summary
The United States has revoked visas for more than 1,000 Chinese nationals under a May 29 presidential proclamation to suspend entry from China of students and researchers deemed security risks, a State Department spokeswoman said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X