వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా, చైనా ‘దోస్త్ మేరా దోస్త్’! ఉత్తరకొరియాపై కుదరని సయోధ్య? పాకిస్తాన్ కు షాక్..

విభేదాలను వీడి పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని అమెరికా, చైనాలు నిర్ణయించాయి. ఈ మేరకు భారీ వ్యాపార ఒప్పందాలు చేసుకున్న రెండు దేశాలు...ఉత్తర కొరియా అంశంపై మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బీజింగ్‌: విభేదాలను వీడి పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని అమెరికా, చైనాలు నిర్ణయించాయి. ఈ మేరకు భారీ వ్యాపార ఒప్పందాలు చేసుకున్న రెండు దేశాలు...ఉత్తర కొరియా అంశంపై మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి.

Recommended Video

చైనా-భారత్ కు హానికరం: అమెరికా హెచ్చరిక | Oneindia Telugu

కరుకుదనం, తెగువ, సాహసం కలబోస్తే.. సౌదీ యువరాజు, అరబ్‌ దేశాల్లో వణుకు..కరుకుదనం, తెగువ, సాహసం కలబోస్తే.. సౌదీ యువరాజు, అరబ్‌ దేశాల్లో వణుకు..

చైనాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గురువారం గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.

<strong>చైనాలో ట్రంప్‌ కు ఘన స్వాగతం! కదిలిన మూడు యుద్ధనౌకలు, అయినా తగ్గని కిమ్!</strong>చైనాలో ట్రంప్‌ కు ఘన స్వాగతం! కదిలిన మూడు యుద్ధనౌకలు, అయినా తగ్గని కిమ్!

మరోవైపు బ్రస్సెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో జరిగిన సదస్సులో అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మాటిస్ మాట్లాడుతూ పాకిస్తాన్ కు షాక్ మీద షాక్ ఇచ్చారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ మాటలు నమ్మేది లేదంటూ మరోమారు ఉద్ఘాటించారు.

చైనా అభ్యంతరం.. అయినా ఆగని నిర్మలా సీతారామన్!చైనా అభ్యంతరం.. అయినా ఆగని నిర్మలా సీతారామన్!

విలువైన వ్యాపార ఒప్పందాలు...

విలువైన వ్యాపార ఒప్పందాలు...

అమెరికా, చైనా దేశాల మధ్య సుమారు రూ.16.75లక్షల కోట్ల (250 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు) విలువైన వ్యాపార ఒప్పందాలు కుదిరాయి. చైనా ఏర్పాటు చేసిన ‘సిల్క్‌ రోడ్‌ ఫండ్‌'కు అమెరికా కూడా నిధులు సమకూర్చనుందని హాంగ్‌కాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ వెల్లడించింది.

ఇకనుంచైనా న్యాయబద్ధంగా...

ఇకనుంచైనా న్యాయబద్ధంగా...

అమెరికా, చైనాలమధ్య జరుగుతున్న వ్యాపార వాణిజ్యాల్లో ఇన్నాళ్లూ చైనాకే అధిక లాభం కలుగుతుండేది. నాలుగింట మూడు వంతులు వాటా చైనాకు దక్కుతుండగా, అమెరికా వాటా ఒక భాగానికే పరిమితమవుతోంది. ఈ విషయాన్ని కూడా ట్రంప్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తో చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘చైనాతో విస్తృత వ్యాపార బంధాన్ని కోరుకుంటున్నాం. ఆ బంధం న్యాయబద్ధమైనది, పరస్పరం ఇచ్చిపుచ్చుకునేదై ఉండాలి. రెండు దేశాల సంబంధాల్లో, వాణిజ్యంలో చాలా కాలంగా కొనసాగుతున్న అసమతుల్యతను చైనా అధ్యక్షుడితో చర్చించా. పరిష్కారానికి గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశా..'' అని తెలిపారు.

ఉత్తరకొరియాపై జీ జిన్‌పింగ్ మౌనం?

ఉత్తరకొరియాపై జీ జిన్‌పింగ్ మౌనం?

ఉగ్రవాద నిర్మూలన, దక్షిణ ఆసియాలో శాంతి, ఆఫ్గానిస్థాన్‌ పరిణామాలపై జీ జిన్‌పింగ్‌, ట్రంప్‌లు చర్చించినట్లు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి హువా చునియింగ్‌ వెల్లడించారు. అణ్వాయుధాల తయారీతో తమ మాటను ధిక్కరిస్తున్న ఉత్తరకొరియాపై గట్టి చర్యలు తీసుకోవాలన్న ట్రంప్‌ సూచనకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ సానుకూలంగా స్పందించనట్లు తెలుస్తోంది.

పాకిస్తాన్ కు షాకిచ్చిన అమెరికా...

పాకిస్తాన్ కు షాకిచ్చిన అమెరికా...

మరోవైపు ఉగ్రవాదానికి ఊతమిచ్చే విధానాలను మానుకుంటేనే పాకిస్తాన్‌కు అంతార్జాతీయ సహకారం ఉంటుందని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్‌ మాటిస్‌ తేల్చి చెప్పారు. ఉగ్రవాదులకు అందిస్తున్న సహకారాన్ని పాకిస్తాన్‌ నిలిపేస్తేనే అమెరికా, నాటో దళాలు సహాయం చేస్తాయని పేర్కొన్నారు. బ్రస్సెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో జరిగిన సదస్సులో మాటిస్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సులో ప్రధానంగా దక్షిణాసియాలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రాంతీయ వాదం, పునరేకీకరణ వంటి అంశాలపై చర్చ జరిగింది.

పాక్ ను నమ్మం, భారత్ తోనే బంధం...

పాక్ ను నమ్మం, భారత్ తోనే బంధం...

దక్షిణాసియాలో నాటో దళాలు ముందుకు సాగాలన్నా, ఉగ్రవాదంపై పోరులో విజయం సాధించాలన్న భారత్‌తో ఉపయుక్తమైన సంబంధాలు ఉండాలని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్‌ మాటిస్‌ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లో అయినా, అఫ్ఘనిస్తాన్‌లోనైనా ఉగ్రవాద స్థావరాలు, కేంద్రాలు ఎక్కడున్నా వాటిని నాటో దళాలు ధ్వంసం చేస్తాయని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌ను అమెరికా నమ్మడం లేదని, ఇక ఊరుకునేది లేదని ఆయన నాటో సదస్సులో వ్యాఖ్యానించారు.

English summary
President Trump heaped praise on President Xi Jinping of China on Thursday, blaming past American administrations for China’s yawning trade surplus with the United States and saying he was confident that Mr. Xi could defuse the threat from North Korea. Mr. Trump’s warm words, on a state visit to China replete with ceremony but short of tangible results, showed a president doubling down on his gamble that by cultivating a personal connection with Mr. Xi, he can push the Chinese leader to take meaningful steps on North Korea and trade.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X