వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం కావాలో తేల్చుకోండి: పాకిస్తాన్‌కు అమెరికా అల్టిమేటం

టెర్రరిస్టులకు స్వర్గధామంగా పాక్ తయారైందన్న అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ వ్యాఖ్యలను పాకిస్తాన్ తోసిపుచ్చింది.ఆయన వ్యాఖ్యలు తమను తీవ్రంగా నిరుత్సాహపరిచాయని పాక్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: టెర్రరిస్టులకు స్వర్గధామంగా పాక్ తయారైందన్న అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ వ్యాఖ్యలను పాకిస్తాన్ తోసిపుచ్చింది. ఆయన వ్యాఖ్యలు తమను తీవ్రంగా నిరుత్సాహపరిచాయని పాక్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది.

పాకిస్తాన్‌కు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్, భారత్‌పై ఇలా పాకిస్తాన్‌కు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్, భారత్‌పై ఇలా

తీవ్రవాదం కారణంగా ప్రపంచంలో మరే దేశం పాకిస్థాన్‌ కంటే ఎక్కువగా నష్టపోవడం లేదని చెప్పింది. ఉగ్రవాదం నిర్మూలనకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని పేర్కొంది. ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించింది.

America could strike inside Pakistan, says Tillerson

మరోవైపు, పాకిస్థాన్‌ ప్రకటనలపై అమెరికా మండిపడింది. ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ చర్యలు ప్రారంభించని పక్షంలో అమెరికాతో అతిపెద్ద నాటోయేతర భాగస్వామ్య దేశంగా ఉన్న హోదాను కోల్పోవలసి వస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి హెచ్చరించారు.

ఈ హోదా కారణంగానే ఇప్పటివరకు ఆర్థికంగా, సైనికపరంగా అమెరికా నుంచి సహాయ సహకారాలు అందాయన్నారు. ఆయన దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా పాకిస్థాన్‌కు ఏం కావాలో ఆలోచించుకోవాలన్నారు.

English summary
America may carry out drone strikes in Pakistan as part of its new regional strategy for stabilising Afghanistan, U.S Secretary of State Rex Tillerson said a day after President Donald Trump announced a change in America’s approach to Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X