వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త చిక్కులు: స్టూడెంట్స్‌కు వీసా కష్టాలు.. యూఎస్ కొత్త నిబంధనలు!

కొత్త నిబంధనల నేపథ్యంలో పలువురు విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. కాలిఫోర్నియాకు చెందిన లీనా ఆర్ కామత్ తనకు హెచ్-1బి వీసా కేటగిరీలో ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించాలని కోరగా..

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విదేశీ వలసలకు అడ్డుకట్ట వేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వీసా నిబంధనలను కఠినతరం చేయడాన్ని ఆయన అస్త్రంగా ఎంచుకున్నారు. ఇప్పటికే ప్రీమియం వీసాలను రద్దు చేసి విదేశీ ఉద్యోగులపై దెబ్బ పడేలా చేసిన ట్రంప్.. తాజాగా స్టూడెంట్ వీసాలపై కొత్త నిబంధనను అమలులోకి తెచ్చారు.

 America issues clarification on higher education exemption

ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ అధికారులు వివరాలు వెల్లడించారు. విద్యార్థులు డిగ్రీ తీసుకునే సమయానికి సదరు విద్యాసంస్థకు యునైటెడ్ స్టేట్స్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ గుర్తింపు ఉంటేనే హెచ్1బి వీసాకు అర్హుడని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రకటించింది. కాగా, అమెరికాలో ప్రతీ ఏటా 65వేల హెచ్-1బి వీసాలతో పాటు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారికి మరో 20వేల హెచ్-1బి వీసాలను అక్కడి ఇమ్మిగ్రేషన్ జారీ చేస్తోంది.

<strong>షాక్: అమెరికాకు వీసా కావాలంటే 15 ఏళ్ళ చరిత్ర చెప్పాల్సిందే</strong>షాక్: అమెరికాకు వీసా కావాలంటే 15 ఏళ్ళ చరిత్ర చెప్పాల్సిందే

కొత్త నిబంధనల నేపథ్యంలో పలువురు విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. కాలిఫోర్నియాకు చెందిన లీనా ఆర్ కామత్ తనకు హెచ్-1బి వీసా కేటగిరీలో ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించాలని కోరగా.. ఇమ్మిగ్రేషన్ తిరస్కరించింది. డిగ్రీ తీసుకునే సమయానికి అతను చదివిన ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీకి హయ్యర్ ఎడ్యుకేషన్ గుర్తింపు లేనందువల్లే తిరస్కరించినట్లు స్పష్టం చేసింది.

English summary
America issues clarification on higher education exemption
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X