వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుష్ భౌతిక కాయం తరలించేందుకు బోయింగ్ 747.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు సీనియర్ బుష్ భౌతికకాయాన్ని టెక్సాస్ నుంచి వాషింగ్టన్ తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అర్జెంటినాలో జరుగుతున్న జీ-20 అంతర్జాతీయ సదస్సు ముగిసిన తర్వాత తాను అమెరికాకు చేరుకుంటానని.. అనంతరం బోయింగ్ 747 విమానాన్ని హుస్టన్ కు పంపుతామని వెల్లడించారు.

బుష్ మరణం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసాధరణమైన నాయకత్వ లక్షణాలతో ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో బుష్‌ చెక్కుచెదరని పటిమను ప్రదర్శించారని కొనియాడారు. ప్రపంచంలోని గొప్ప నాయకుల్లో బుష్ ముందుంటారని వ్యాఖ్యానించారు.

సీనియర్ బుష్

సీనియర్ బుష్

పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ హెర్బర్ట్‌ వాకర్‌ బుష్‌ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 94 సంవత్సరాలు. సీనియర్‌ బుష్‌గా ప్రాచుర్యం పొందిన బుష్ 1989-1993 మధ్య కాలంలో అమెరికాకు 41వ అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయన హయాంలో చరిత్ర మరచిపోని ఘటనలెన్నో జరిగాయి. అమెరికా విరోధి కూటమి సోవియెట్‌ యూనియన్‌ పతనం, కువైట్‌పై దురాక్రమణకు పాల్పడిన ఇరాక్‌ ఓటమి, జర్మనీ గోడ కూల్చివేత లాంటి అసాధరణ చారిత్రక ఘటనలు చోటుచేసుకున్నాయి.

బుష్ అంత్యక్రియలకు ట్రంప్

బుష్ అంత్యక్రియలకు ట్రంప్

సీనియర్ బుష్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తికానున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాటు ఆయన సతీమణి హాజరుకానున్నారు. బుష్ భౌతికకాయాన్ని రోటుండాలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు బుష్ భైతికకాయాన్ని తీసుకురానుంది సైన్యం. అనంతరం సోమవారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాల నుంచి బుధవారం ఉదయం 7 గంటలవరకు ప్రజలు చూడటానికి అనుమతిస్తారు.

అమెరికా అధ్యక్షుల్లో ఎక్కువ కాలం జీవించింది ఈయనే..!

అమెరికా అధ్యక్షుల్లో ఎక్కువ కాలం జీవించింది ఈయనే..!

1924 జూన్ 24న మసాచుసెట్స్ లో జన్మించిన బుష్ కు ఈ ఏడాదితో 94 ఏళ్లు పూర్తయ్యాయి. ఎక్కువకాలం జీవించిన అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయనే కావడం విశేషం. అతి చిన్న వయసులో 18 ఏళ్లకే నేవీలో పైలట్ గా నియమితులయ్యారు బుష్. ఇది కూడా ఆయన చరిత్రలో రికార్డే. 1945లో బార్బరా పియర్స్ ను పెళ్లాడారు. వీరికి ఆరుగురు సంతానం. అందులో పెద్దకుమారుడు జార్జ్ బుష్ జూనియర్ అమెరికాకు 43వ అధ్యక్షుడిగా పనిచేశారు. కెన్నడీ కుటుంబం తర్వాత అమెరికాలో ఎక్కువ పదవులు చేపట్టింది వీరి కుటుంబమే. సీనియర్ బుష్ సతీమణి బార్బరా ఈ ఏడాది ఏప్రిల్ లో అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు.

English summary
Donald Trump announced that he would send his presidential aircraft to bring the casket of his late predecessor George H.W. Bush from Texas to Washington. After the G-20 International Conference in Argentina, he said he would reach the United States and then send Boeing 747 to Houston.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X