వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని అంతం చేసిన కుక్క ఇదే, గ్రేట్ జాబ్, వాడు విలన్, నేను హీరో !

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్స్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐసిస్)పేరుతో ప్రపంచాన్ని వణికించిన ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ అధినేత అబుబాకర్‌ అల్‌ బాగ్దాదిని అమెరికా సైనిక బలగాలు ఓ కుక్క సహాయంతో హతమార్చాయి. సిరియాలోని ఐసిస్‌ స్థావరాలపై అమెరికా బలగాలు దాడులు జరిపిన సమయంలో బాగ్దాదీ పారిపోతుంటే అమెరికా దళాలు సొరంగంలో ఓ కుక్కను వదిలారు. పారిపోతున్న ఉగ్రవాదులను వెంటాడిన ఆ కుక్క బాగ్దాదీ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయ్యింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాగ్దాదీని అంతం చేసిన కుక్క ఇదే, గ్రేట్ జాబ్ అంటూ ఓ ఫోటో ట్వీట్ చెయ్యడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రపంచ దేశాలను గడగడలాడించిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబుబాకర్ అల్ బాగ్దాదీని అంతం చేసిన నువ్వు కుక్కవు కాదు నిజంగా హీరో అంటున్నారు నెటిజన్లు.

ఇంత బతుకు బతికి కుక్క చావు అంటే ఇదే, వయాగ్రా మాత్రలతో వేలాది మందిని రేప్ చేసి!ఇంత బతుకు బతికి కుక్క చావు అంటే ఇదే, వయాగ్రా మాత్రలతో వేలాది మందిని రేప్ చేసి!

గ్రేట్ జాబ్

గ్రేట్ జాబ్

ఐసిస్ ఉగ్రవాది అబుబాకర్ బాగ్దాదీని అంతం చేసిన కుక్క ఇదే, వేలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది బాగ్దాదీకి భయం పుట్టించి అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయ్యింది, గ్రేట్ జాబ్ అంటూ కుక్కను మెచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్ ఆ కుక్క ఫోటోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఇద్లిబ్ లో సొరంగం

ఇద్లిబ్ లో సొరంగం

సిరియా వాయువ్య పశ్చిమ ప్రాంతంలోని ఇద్లిబ్ ప్రాంతంలోని ఓ ఇంటిలో బాగ్దాదీ తల దాచుకున్నాడని అమెరికా బలగాలకు సమాచారం అందింది. అదే ఇంటిలో ఓ రహస్య సొరంగం ఉందని అమెరికా బలగాలకు తెలిసింది. ఎలాగైనా ఈ రోజు బాగ్దాదీ పీడ వదిలించుకోవాలని అమెరికా సైనిక బలగాలు నిర్ణయించాయి.

భయం పుట్టించిన కుక్క

భయం పుట్టించిన కుక్క

అమెరికా బలగాల వైమానిక దాడులతో ఆందోళనకు గురైన బాగ్దాదీ సొరంగ మార్గంలో పారిపోవడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో సొరంగం నుంచి బాగ్దాదీని బయటకు తీసుకురావడానికి అమెరికా బలగాలు ప్రయత్నించాయి. అయితే వీలు కాకపోవడంతో సొరంగంలో కుక్కను వదిలారు.

గత్యంతరం లేక ఆత్మహత్య

గత్యంతరం లేక ఆత్మహత్య

సొరంగంలో పారిపోతున్న బాగ్దాదీ తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అయితే సొరంగం చివరిలో టన్నల్ ఉండటంతో బాగ్దాదీ బయటపడటానికి వీలులేకుండా పోయింది. అమెరికా బలగాలకు ప్రాణాలతో పట్టుబడితే నరకం చూపిస్తారని బాగ్దాదీ భయపడిపోయాడు. కుక్క వెంటాడం, తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడంతో బాగ్దాదీ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.

వయాగ్రాకు బానిస

వయాగ్రాకు బానిస

మహిళలు, ఆడ పిల్లలు అంటే అబుబాకర్ అల్ బాగ్దాదీ కామంతో రెచ్చిపోయేవాడు. బాగ్దాదీ వయాగ్రా ఔషదాలకు బానిస అయ్యాడు. కామవాంచ తీర్చుకోవడానికి వయాగ్రా మాత్రలు వేసుకుని మహిళల మీద అత్యాచారం చేశాడు. అమెరికా, సిరియాలతో ప్రపంచ దేశాలను డగడలాడించిన బాగ్దాదీని అంతం చెయ్యడానికి గత ఐదేళ్ల నుంచి అమెరికా వేచి చేసి చివరికి అనుకున్న పని సాధించింది.

డొనాల్డ్ ట్రంప్ గ్రేట్

డొనాల్డ్ ట్రంప్ గ్రేట్

ఐసీస్ వంటి ఉగ్రమూకను నడిపిస్తున్న బాగ్దాదీని అంతం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను నేడు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రపంచంలోనే కరుడుగట్టిన ఉగ్రవాది బాగ్దాదీని అంతం చెయ్యడానికి ట్రంప్ చాలా చాకచక్యంగా వ్యవహరించారని, ఆయన్ను అభినందిస్తున్నారు. అయితే ఎన్నికల్లో భాగంగా ట్రంప్ చాల చాకచక్యంగా వ్యవహరించి ఓట్లను సొమ్ము చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

నేను కుక్కనే, ఆ చావు ఎలా ఉంటుందంటే ?

నేను కుక్కనే, ఆ చావు ఎలా ఉంటుందంటే ?

బాగ్దాదీ కుక్క చావు చచ్చాడు అని ట్రంప్ అంటున్నారు. నేను కుక్కనే కాని ఐసిస్ ఉగ్రవాదులకు కుక్క చావు రుచి చూపించాను అని ఆ కుక్క ఫీలింగ్. బాగ్దాదీని అంతం చేసిన ఆ కుక్క ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో అయ్యింది. నువ్వ నిజంగా కుక్కవే అయినా బాగ్దాదీకి కుక్క చావు రుచి చూపించావు అంటున్నారు నెటిజన్లు. కుక్క వెంబడించడంతో సొరంగం చివరి వరకూ వెళ్లిన బాగ్దాదీ టన్నల్ నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో ఆమెరికా దళాలకు భయపడి ఒంటి మీద అమర్చుకున్న బాంబులు పేల్చుకోవడంతో కుక్కచావు చచ్చాడు.

లాడెన్, బాగ్దాదీకి అదే చావు

లాడెన్, బాగ్దాదీకి అదే చావు

ఆల్ ఖైదా అధినేత బిన్ లాడెన్ ను హతమార్చడానికి 2011లో అమెరికా సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. అమెరికా సైనికుల బలగాల దెబ్బకు బిన్ లాడెన్ విలవిలలాడిపోయాడు. కోట్లాది మంది అమెరికా ప్రజలకు నిద్రలేకుండా చేసిన బిన్ లాడెన్ ను ఎలాగైనా అంతం చెయ్యాలని అమెరికా నిర్ణయించింది. అమెరికా సీక్రెట్ ఆపరేషన్ లో బిన్ లాడెన్ అంతం అయ్యాడు. బిన్ లాడెన్ ను అంతం చేసినట్లే ఇప్పుడు అమెరికా సైనిక బలగాలు ఐసిస్ చీఫ్ అబుబాకర్ అల్ బాగ్దాదీని అంతం చేశాయి లాడన్, బాగ్దాదీ పీడవిరగడ కావడంతో అమెరికా ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

English summary
Ameriba President Donald Trump Praises Dog Which killed Leader of ISIS, Abu Bakr al Baghdadi. Donald Trump Remembers courageous Dog, That Killed Most Wanted Bagdhadi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X