వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో మరో దారుణం... తొలి ముస్లిం మహిళా న్యాయమూర్తి దారుణ హత్య!

అమెరికాలో తొలి ముస్లిం మహిళా న్యాయమూర్తిగా ఎన్నికై రికార్డు సృష్టించిన షీలా అబ్దుస్ సలామ్ హడ్సన్ నదిలో విగత జీవిగా కనిపించడం కలకలం రేపింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్ అమెరికాలో మరో దారుణం జరిగింది. దేశంలో తొలి ముస్లిం మహిళా న్యాయమూర్తిగా ఎన్నికై రికార్డు సృష్టించిన షీలా అబ్దుస్ సలామ్ (65) హడ్సన్ నదిలో విగత జీవిగా కనిపించడం కలకలం రేపింది.

న్యూయార్క్ స్టేట్ అత్యున్నత న్యాయస్థానంలో అసోసియేట్ జడ్జిగా ఉన్న ఆమె హర్లీమ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నదిలో ఎవరిదో మృతదేహం తేలియాడుతోందని న్యూయార్క్ పోలీసులకు సమాచారం అందింది.

America's first woman Muslim judge found dead in Hudson River

ఆ సమాచారంపై స్పందించిన న్యూయార్క్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి, ఆమె మహిళా న్యాయమూర్తి అబ్దుస్ సలామ్ అని గుర్తించారు. అయితే ఆమెపై దాడి జరిగిన ఆనవాళ్లు లేవని, ధరించిన బట్టలు కూడా చెరగలేదని వారు పేర్కొన్నారు.

2013 నుంచి న్యాయమూర్తిగా ఉన్న ఆమె, అంతకుముందు 15 సంవత్సరాలు మన్ హటన్ కోర్టులో ఫస్ట్ అపిలేట్ డివిజన్ లో సేవలందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న న్యూయార్క్ పోలీసులు విచారణ జరుపుతున్నామని తెలిపారు.

English summary
New York: The first American Muslim woman judge was found dead in the Hudson River in New York on Wednesday. The body showed no apparent signs of trauma or indication of foul play, US news outlets reported, citing police sources. Sheila Abdus-Salaam, 65, served on New York’s court of appeals, the state’s highest bench. Public officials praised Abdus-Salaam, noting her “groundbreaking” achievements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X