వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ ఆరోగ్య సంస్థతో తెగతెంపులు చేసుకున్న అమెరికా : సంచలన నిర్ణయం ప్రకటించిన ట్రంప్

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికా సంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్నట్టు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి లేదని, మొదట చైనాలోని వూహాన్ లో కరోనా వ్యాప్తి జరిగినప్పుడే ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని మరోసారి తీవ్రంగా ఆయన ఆరోపించారు.

Recommended Video

US Terminates Relationship with WHO: Donald Trump

లాక్ డౌన్ 4.0 ముగుస్తున్న వేళ ఏపీలో మరికొన్ని మినహాయింపులు .. ఏపీ ప్రజలకు శుభవార్తలాక్ డౌన్ 4.0 ముగుస్తున్న వేళ ఏపీలో మరికొన్ని మినహాయింపులు .. ఏపీ ప్రజలకు శుభవార్త

డబ్ల్యూహెచ్‌ఓతో సంబంధాల రద్దు .. ట్రంప్ నిర్ణయం

డబ్ల్యూహెచ్‌ఓతో సంబంధాల రద్దు .. ట్రంప్ నిర్ణయం

ఇక దీంతోఅమెరికా ఈ రోజు డబ్ల్యూహెచ్‌ఓతోసంబంధాలను రద్దు చేయబోతోందని సంచలన నిర్ణయం అని ప్రకటించారు డోనాల్డ్ ట్రంప్ . తాము కోరినవిధంగా ఎంతో అవసరమైన సంస్కరణలు చేయడంలో విఫలమైనందున సంస్థ నుంచి వైదొలగుతున్నామని ఆయన ప్రకటించారు. చైనా ప్రభుత్వ కోరిక మేరకు ప్రపంచాన్ని కరోనా వైరస్ పై అప్రమత్తం చేయకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తప్పుదారి పట్టించింది అని వైట్ హౌస్ రోజ్ గార్డెన్ లో మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.

కరోనా వైరస్ గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయలేదని ట్రంప్ ఆరోపణ

కరోనా వైరస్ గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయలేదని ట్రంప్ ఆరోపణ

చైనాలో వైరస్ పుట్టుక, దాని వ్యాప్తి విషయాలనుడబ్ల్యూహెచ్ఓ కప్పిపుచ్చిందని, అసలు కరోనా వైరస్ గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయలేదని ఆయన ఆరోపించారు. దీనికి ఆ సంస్థ బాధ్యత వహించేలా తప్పకుండా చేయాలని పేర్కొన్న డోనాల్డ్ ట్రంప్ ఈ నేపథ్యంలో దాదాపు 400 మిలియన్లడాలర్లు (మూడు వేల కోట్ల రూపాయలకు పైగా) వార్షిక సహకారాన్ని ఇతర ఆరోగ్య సంస్థలకు మళ్ళించనున్నామని తెలిపారు.కరోనా వైరస్ చైనా దేశం వల్లే ఇంతగా వ్యాప్తి చెందుతుందని, అమెరికాలో మరణ మృదంగం మోగించడానికి చైనానే కారణమని ఆయన మండిపడ్డారు .

చైనా ఒత్తిడే డబ్ల్యూహెచ్ఓ ఫెయిల్ కు కారణం అన్న ట్రంప్ ..నిధులు నిలిపివేత

చైనా ఒత్తిడే డబ్ల్యూహెచ్ఓ ఫెయిల్ కు కారణం అన్న ట్రంప్ ..నిధులు నిలిపివేత

చైనా ప్రభుత్వం చేసిన తప్పు ఫలితంగా ప్రపంచం బాధపడుతోందని డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.వైరస్ గురించి ప్రపంచాన్ని తప్పుదారి పట్టించాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థపై చైనానే ఒత్తిడి తెచ్చిందని ట్రంప్ విమర్శించారు.అంతేకాదు కరోనా వైరస్ వ్యాప్తిపై స్పందించే విషయంలో డబ్ల్యూహెచ్ఓ తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఫెయిల్ అయిందని ఆరోపించడంతో పాటు డబ్ల్యూహెచ్ఓకు నిధులు నిలిపివేస్తామంటూ గతంలోనే హెచ్చరించారు. తాత్కాలికంగా నిధులను నిలిపివేస్తూనిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిస్థితి ఇప్పుడు డైలమాలో పడింది.

English summary
president Donald Trump said Friday the U.S. will terminate its relationship with the World Health Organization over its handling of the coronavirus outbreak in China.Trump, who has complained for weeks about the World Health Organization as the virus death toll surged in the United States, said the global health body failed to adequately respond to the outbreak because China has “total control” over the global organization
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X