వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బదలీ కోరితే ఉద్యోగం ఔట్: భారత సంతతి ఉద్యోగికి అమెరికా కంపెనీ లక్షడాలర్ల పరిహారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఓ భారతీయుడిపై వివక్ష చూపించినందుకు గాను అమెరికాకు చెందిన కాంబర్ కార్పోరేషన్ సంస్థ అతనికి 1,00,000 డాలర్ల పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. అతను కంపెనీని కోర్టుకు లాగడంతో పరిహారం కోసం ఒప్పుకుంది.

మరోచోటుకు బదలీ చేయాలని కోరడంతో

మరోచోటుకు బదలీ చేయాలని కోరడంతో

తనపై వివక్ష చూపించిందని దావా వేస్తే, దానిని పరిష్కరించుకునేందుకు ఆ కంపెనీ ఈ మొత్తాన్ని చెల్లించడానికి ముందుకు వచ్చింది. అశోక్‌ పేయ్ అనే వ్యక్తి దివ్యాంగుడైన తన కుమారుడిని చూసుకునేందుకు, అతడికి దగ్గరగా ఉండేందుకు మరోచోటుకు బదిలీ చేయమని కంపెనీకి విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగం నుంచి తొలగించింది

ఉద్యోగం నుంచి తొలగించింది

కొడుకు కోసం కొన్ని రోజులు సెలవు అడిగారు. కానీ కంపెనీ నిరాకరించడంతో పాటు అతనిని ఉద్యోగం నుంచి తీసివేసింది. దీంతో ఆయన అమెరికా సమాన ఉద్యోగ అవకాశ కార్పొరేషన్‌ను(ఈఈఓసీ- అమెరికా ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ కమిషన్) ఆశ్రయించాడు.

 విచారణలో తేలిన ఉల్లంఘన

విచారణలో తేలిన ఉల్లంఘన

ఆ కంపెనీలో బాధితుడు ఫెడరల్ కాంట్రాక్టరుగా పని చేశాడు. తనను ఉద్యోగంలో నుంచి తొలగించి వయసులో తనకంటే ఇరవై ఏళ్ల చిన్నవాడైన వ్యక్తిని నియమించారని, తన కొడుకు వైకల్యంతో పాటు తన వయసు కారణంగా కూడా తనపై వివక్ష చూపారని అతను దావా వేశాడు. దీనిపై విచారణ జరిపిన ఈఈఓసీ.. కంపెనీ చట్టాలను ఉల్లంఘించినట్లు పేర్కొంది.

లక్ష డాలర్ల పరిహారం

లక్ష డాలర్ల పరిహారం

అశోక్‌ కుమారుడి ఆరోగ్య పరిస్థితి వల్ల బదిలీకి నిరాకరించడం చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. కాంబర్‌ వర్జీనియా కార్యాలయంలో ఉద్యోగి పట్ల వివక్ష చూపినట్లు అమెరికా న్యాయ విభాగం కూడా తెలిపింది. దీంతో కంపెనీ ఈ దావాను పరిష్కరించేందుకు అతనికి లక్ష డాలర్ల నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకారం తెలిపింది.

English summary
An American firm will pay USD 100,000 to settle a discrimination lawsuit filed on behalf of an Indian-origin employee who was fired for seeking a transfer to care for his differently abled son.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X