వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్స్ వెనకాల మమ్మల్ని నిలబెడుతున్నారు!: ఓ అమెరికన్ జాత్యహంకార వ్యాఖ్య..

సిమోని లొనావో(27) అనే వ్యక్తి ఆమె అరుస్తున్న సమయంలో వీడియో తీసి.. ఆపై దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో అమెరికాలో జాత్యహంకార చర్యలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానికతకు ప్రాధాన్యం ఇస్తుండటం.. విదేశీ వలసలకు చెక్ పెడుతుండటంతో 'లోకల్' సెంటిమెంటు అక్కడ బాగా బలపడింది.

దీంతో విదేశీయుల వల్లే తాము ఉద్యోగాలు కోల్పోతామని భావించిన చాలామంది అమెరికన్ యువత.. అమెరికాలోని ఇతర దేశస్తులను ద్వేషించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని జాత్యహంకార దాడులు జరగ్గా.. తాజాగా ఓ శ్వేత జాతి మహిళ భారతీయ ఉద్యోగినిపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసింది. పరుషపదజాలంతో పెద్దగా అరుస్తూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

american hate comments against an indian employee

ఇంతకీ ఎందుకంతలా ఆమె ఫైర్ అయిందంటే!.. క్యాష్ కౌంటర్ వద్ద క్యూలో నిలబడ్డ సమయంలో ఆమె సహనం కోల్పోయింది. ఒకటే కౌంటర్ ఉండటం, క్యూ రద్దీగా ఉండటంతో ఆమె త్వరగా అసహనానికి లోనైంది. తన అసహనమంతా క్యాష్ కౌంటర్ లో విధులు నిర్విర్తిస్తున్న భారతీయ ఉద్యోగినిపై వెల్లగక్కింది.

భారతీయులను ఉద్యోగాల్లో నియమించుకుని, మమ్మల్ని వారి వెనకాల నిలబెడుతున్నారంటూ మండిపడింది. ఇండియన్స్ ను వారి స్వదేశానికి పంపించేయండి అంటూ గట్టిగా అరిచింది. సిమోని లొనావో(27) అనే వ్యక్తి ఆమె అరుస్తున్న సమయంలో వీడియో తీసి.. ఆపై దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే ఆమె కోపానికి మరో కారణం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. కౌంటర్ వద్ద క్యూలో తన ముందు నిలబడ్డ ఓ ఇండియన్ ఫ్యామిలీకి, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఇండియన్ ఉద్యోగిని ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఆమెకు నచ్చలేదట. దీంతో ఆమె అసహనానికి లోనైందంటున్నారు.

మరికొంతమంది మాత్రం.. ఆమె ముందు నిల్చున్నది ఓ లాటిన్ కుటుంబమని, వారి వద్ద కొన్ని ఓచర్లు ఉండటంతో.. వాటిని క్లియర్ చేయడానికి 20ని. పైగా సమయం పట్టిందని పేర్కొంటున్నారు. అంతసేపు క్యూలో నిల్చోలేక అసహనంతో ఆమె నోరు పారేసుకుందని చెబుతున్నారు.

English summary
An American woman was made hate comments against a Indian woman while she was in her duty at cash counter. The woman lost her patience for take more time
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X