వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు షాక్: స్థానికులకే ఉద్యోగాలు, విప్రోలో 14 వేల అమెరికన్లకు ఉపాధి

అమెరికాలోని తమ కార్యాలయాల్లో స్థానిక ఉద్యోగుల సంఖ్య సగానికి పైగానే ఉందని ఐటీ దిగ్గజం విప్రో ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: అమెరికాలోని తమ కార్యాలయాల్లో స్థానిక ఉద్యోగుల సంఖ్య సగానికి పైగానే ఉందని ఐటీ దిగ్గజం విప్రో ప్రకటించింది.

గడిచిన ఆరు మాసాల్లో స్థానిక నిపుణులకు శిక్షణనిచ్చి సుమారు 1600 మందిని తీసుకొన్నట్టు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3600 మంది స్థానికులు తమ సంస్థలో చేరినట్టు ఆ సంస్థ వెల్లడించింది.

wipro

దీంతో అమెరికాలో మొత్తం సిబ్బంది సంఖ్య 14 వేలకు చేరుకొందని విప్రో ప్రకటించింది. నెక్స్ట్ జనరేషన్ లోకల్ డెలివరీ సెంటర్స్ ఏర్పాటుచేసిన ఫ్లోరిడా, కాలిఫోర్నియా, జార్జియా, టెక్సాస్ రాష్ట్రాల్లో వెయ్యి మంది ఉద్యోగులు ఉన్నట్టు వెల్లడించింది.

గత దశాబ్దకాలంగా తాము రెండు బిలియన్ డాలర్లను అమెరికాలో పెట్టుబడి పెట్టినట్టు ఆ సంస్థ తెలిపింది.స్థానికంగా ఉపాధి కల్పనపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు విప్రో సీఈవో అబిదాలి నీముచ్ వాలా తెలిపారు.

English summary
Americans now constitute 50 per cent of the Wipro workforce in the US, making it the first major Indian IT company to cross the benchmark that could help it get rid of some of the punitive provisions of Congressional legislations with regard to hiring foreign workers on H-1B visas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X