వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమ్ బ్యాక్ ఒబామా: కరోనాపై అదరగొట్టే స్పీచ్ ఇచ్చిన బరాక్: అమెరికన్ల ఫిదా: ట్రంప్‌పై సెటైర్లు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: బరాక్ ఒబామా. రెండుసార్లు అగ్రరాజ్యం అమెరికాను ఏలిన అధ్యక్షుడు. బిల్ క్లింటన్ తరువాత ఆ స్థాయిలో గ్లామర్ ఉన్న అంతర్జాతీయ స్థాయి నాయకుడిగా గుర్తింపు పొందారు. డెమోక్రటిక్ పార్టీకి ప్రాతినిథ్యాన్ని వహించిన బరాక్ ఒబామాపై అమెరికన్లలో ఇంకా క్రేజ్ తగ్గలేదనడానికి తాజా ఉదాహరణ ఈ ఘటన. కరోనా కష్ట కాలంలో ఒబామా తమ దేశాధ్యక్షుడిగా ఉండి ఉంటే ఎలా ఉండేదనే అభిప్రాయం అమెరికన్లలో వ్యక్తమౌతోంది. కరోనా వైరస్‌ను ఆయన సమర్థవంతంగా కట్టడి చేసి ఉండేవారనే అభిప్రాయం నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కంపేర్ చేస్తున్నారు. ఒబామా ఉంటే బాగుంటుందనే డిమాండ్‌ను వినిపిస్తున్నారు.

ఆర్టీసీకి కొత్త టాస్క్: బోర్డర్ టు బోర్డర్: లాక్‌డౌన్ ముగిసేంత వరకూ: ప్రత్యేక రైళ్లుఆర్టీసీకి కొత్త టాస్క్: బోర్డర్ టు బోర్డర్: లాక్‌డౌన్ ముగిసేంత వరకూ: ప్రత్యేక రైళ్లు

నల్ల జాతీయులను ఉద్దేశించిన ఒబామా స్పీచ్..

నల్ల జాతీయులను ఉద్దేశించిన ఒబామా స్పీచ్..

దీనికి కారణం లేకపోలేదు. కరోనా వైరస్‌పై ఒబామా ఇచ్చిన ఓ స్పీచ్.. అమెరికన్లను విపరీతంగా ఆకట్టుకుంది. వారిని కట్టి పడేసింది.కరోనా వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ఎలా నియంత్రించవచ్చు? ఎలాంటి ముందుజాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది? వ్యాప్తి చెందిన తరువాత.. ఎలాంటి రక్షణాత్మక ధోరణిని అనుసరించాల్సి ఉంటుంది? అనే అంశాలపై ఆయన ప్రసంగించారు. `షో మీ యువర్ వాక్.. హిస్టారికల్లీ బ్లాక్ కొలీగ్స్ అండ్ యూనివర్శిటీస్ (హెచ్‌బీసీయు)`పై ఆయన సోషల్ మీడియా ద్వారా ఉపన్యసించారు.

78 వేల మందిని ఉద్దేశించి ప్రసంగం..

78 పాఠశాలల నుంచి సుమారు 27 వేల మందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆయన స్పీచ్‌ను ట్విట్టర్, యూట్యూబ్‌లల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. కరోనా వల్ల యూనివర్శిటీలు, విద్యాసంస్థలు మూతపడటం వల్ల ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ ద్వారా విద్యాబోధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా 78 పాఠశాల విద్యార్థులు, బోధన, బోధనేతర ఉద్యోగులను ఉద్దేశించి బరాక్ ఒబామా ప్రసంగించారు. వారిలో అత్యధికులు బ్లాక్ కమ్యూనిటీకి చెందిన వారే. కరోనా వైరస్ గురించి గానీ, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వచేపడుతున్న చర్యలపై గానీ ఎక్కడా నేరుగా ప్రస్తావించలేదు.

సంక్షోభ సమయాన్ని ఎదురీదేలా..

ఆఫ్రికన్ అమెరికన్ల చరిత్ర గురించి ఆయన మాట్లాడారు. అమెరికా చరిత్ర గురించి ప్రస్తావించారు. ఆ దేశ గొప్పదనం గురించి వివరించారు. ఇదివరకు కరోనా వంటి సంక్షోభ సమయాల్లో అమెరికా ఎలాంటి పరిపాలనా దక్షతను, చాకచక్యాన్ని ప్రదర్శించదనే విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని నివారించడానికి ప్రభుత్వం చేస్తోన్న, తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఆశాజనకంగా లేవని స్పష్టం చేశారు. కరోనా వంటి సంక్షోభ పరిస్థితులు నల్ల జాతీయులు, ఆఫ్రికన్ అమెరికన్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని అన్నారు.

నివారించలేకి ట్రంప్ ప్రభుత్వం..

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత సమర్థవంతంగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయని అన్నారు. కరోనా నియంత్రణ చర్యలు ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను మరింత తీవ్రం చేసేవిలా ఉన్నాయని విమర్శించారు. నల్ల జాతీయులను తీవ్రంగా నష్టపరిచేలా ఉన్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలు మున్ముందు మరిన్ని చూడలానికి అవకాశాలు రావచ్చనీ ఒబామా అభిప్రాయపడ్డారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం వ్యూహాత్మక తప్పిదాలను చేసిందని, దాని ప్రభావాన్ని చూస్తున్నామని అన్నారు.

అమెరికన్ల ప్రశంసలు.. కమ్‌బ్యాక్ అంటూ నినాదాలు..

అమెరికన్ల ప్రశంసలు.. కమ్‌బ్యాక్ అంటూ నినాదాలు..

ఆయన ఇచ్చిన ఈ స్పీచ్.. సోషల్ మీడియాను షేక్ చేసింది. వ్యూహాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఆయన విమర్శించడం పట్ల అమెరికన్లు మంత్రముగ్ధులయ్యారు. ఆ మాత్రం అవగాహన డొనాల్డ్ ట్రంప్‌కు లేదనే చెబుతున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కమ్‌బ్యాక్ ఒబామా అంటూ నినదిస్తున్నారు. మెమెలను తయారు చేసిన సోషల్ మీడియాలో వదులుతున్నారు. ప్రస్తుత సమయంలో ఒబామా వంటి నాయకుడు అధికారంలో ఉండాల్సిన అవసరం ఏర్పడిందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మరోసారి పోటీ చేయాలనే డిమాండ్‌నూ వినిపిస్తున్నారు.

English summary
Obama spoke on "Show Me Your Walk, HBCU Edition," a two-hour event for students graduating from historically black colleges and universities broadcast on YouTube, Facebook and Twitter. His remarks were unexpectedly political, given the venue, and touched on current events beyond the virus and its social and economic impacts. Former President Barack Obama on Saturday criticized US leaders overseeing the nation's response to the coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X