వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిత్రదేశాలకు మాల్దీవుల రాయబారులు, జాబితాలోలేని భారత్, చైనా హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

మాలే: రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న మాల్దీవులు.. సమస్య పరిష్కారం కోసం మిత్రదేశాల సాయం కోరుతోంది. అధ్యక్షులు అబ్దుల్లా యామీన్ దేశంలో సంక్షోభ పరిస్థితులను చక్కబెట్టాలని కోరుతూ మిత్రదేశాలకు రాయబారులను పంపిస్తున్నారు. చైనా, పాకిస్తాన్, సౌదీ అరేబియాలు ఈ జాబితాలో ఉండగా భారత్ మాత్రం లేదు.

మాల్దీవుల్లో సంక్షోభంలో భారత సైన్యం జోక్యం చేసుకోవద్దని, పరిస్థితిని మరింత సంక్లిష్టం చేయొద్దని, అది మాల్దీవుల అంతర్గత అంశమని చైనా హెచ్చరించిన తర్వాత కొద్ది సేపటికే మాల్దీవులు అధ్యక్షులు మిత్ర దేశాలకు రాయబారులను పంపుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.

Amid Crisis, Maldives Sends Envoys To "Friendly" Nations, India Not Included

మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మొహమ్మద్‌ నషీద్‌ పలుమార్లు భారత్‌ జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేయాలని అభ్యర్థించారు. చైనా తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్‌ రాయబారులు, సైన్యాన్ని తమ దేశానికి పంపి పరిస్థితి చక్కదిద్దాలన్నారు. ఈ నేపథ్యంలోనే చైనా మాల్దీవులు విషయంలో భారత్‌ జోక్యం చేసుకోవడం మంచిది కాదని పేర్కొంది.

English summary
Maldives President Abdulla Yameen, who appears to have gained the upper hand in a bitter power struggle in the tiny island nation, on Wednesday decided to reach out to "friendly countries", announcing envoys to China, Pakistan and Saudi Arabia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X