• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా ఆర్థిక మూలాలపై దెబ్బ.. ఆ సీఎం చేసి చూపించారు.. 3భారీ ప్రాజెక్టులు రద్దు..

|

''మనం శాంతినే కోరుతుండొచ్చు. కానీ అవతలివాడు పిచ్చిపట్టినట్లు రెచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? మన మంచితనాన్ని చేతగానితనంగా చైనా భావిస్తున్నట్లుంది. కంటికి కన్ను పెరికించి చేతిలో పెట్టాల్సిన టైమొచ్చింది. చైనాను దెబ్బ తీసే ఎలాంటి విధానానికైనా మేం సిద్ధంగా ఉన్నాం''.. సరిగ్గా మూడు రోజుల కిందట ప్రధాని మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో శివసేన చీఫ్, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే చెప్పిన మాటలివి. తాను అన్న మాటల్ని అక్షరాలా చేసి చూపించారాయన. చైనా కంపెనీలతో ఒప్పందాల రద్దుకు సంబంధించి ఇప్పటిదాకా కేంద్ర సర్కారు మాత్రమే పలు ఆదేశాలు జారీచేయగా.. తొలిసారిగా ఓ రాష్ట్రం కూడా ఈ తరహా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

  #IndiaChinaStandoff: China తో పోటీ పడే స్థాయిలో India లేదు కాదని ముందుకొస్తే ఘోరమైన అవమానమే!

  జిన్ పింగ్‌పై చైనా ప్రజల ఆగ్రహం.. గాల్వాన్‌లో హింస తర్వాత మళ్లీ చర్చలు.. భారత్ కొత్త స్ట్రాటజీ

  చైనీస్‌కు షాక్..

  చైనీస్‌కు షాక్..

  కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలన్న ఉద్దేశంతో మహారాష్ట్ర సర్కారు ఇటీవల ‘‘మాగ్నటిక్ మహారాష్ట్ర 2.0'' పేరుతో పెట్టుబడుల సదస్సు నిర్వహించింది. అందులో వివిధ దేశాలకు చెందిన పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఆక్రమంలోనే చైనాకు చెందిన బడా సంస్థలతో మూడు భారీ ప్రాజెక్టులకు ఒప్పందం కుదిరింది. ఈనెల 17న మహారాష్ట్ర సర్కారు సదరు ఒప్పందాలపై సంతకాలు చేసిన కొద్దిసేపటికే.. గాల్వాన్ లోయలో చైనా హింసాకాండ వెలుగులోకి వచ్చింది. దీంతో రోజుల వ్యవధిలోనే చైనీస్ కంపెనీలకు షాకిస్తూ మహా సర్కారు ఒప్పందాలను రద్దు చేసుకుంది.

  మోదీకి చైనా జేజేలు.. మాతో పెట్టుకోలేరు.. గాల్వాన్‌పై ప్రధాని ప్రకటన భేష్.. పాక్ అయ్యింటే వేరే సీన్..

  వాటి విలువ రూ.5వేల కోట్లు..

  వాటి విలువ రూ.5వేల కోట్లు..

  మహారాష్ట్ర ప్రభుత్వం చైనా కంపెనీలతో రద్దు చేసుకున్న ఒప్పందాల విలువ రూ.5వేల కోట్లు. వాటి వివరాలిలా ఉన్నాయి. 1.పుణెలోని తాలేగావ్ లో వాహన తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం చైనా దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ గ్రేట్ వాల్ మోటార్స్ (జీడబ్ల్యూఎం)తో రూ.3,770 కోట్ల విలువైన ఒప్పందం, 2.కనీసం రెండు వేల మందికి ఉపాధి లభించేలా చైనాకు చెందిన ఫోటాన్ సంస్థ రూ.1000 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేసే ఒప్పందం, 3.తాలేగావ్ లోనిహెంగ్లీ ఇంజినీరింగ్ ప్లాంటు విస్తరణకు సంబంధించిన రూ.250 కోట్ల ఒప్పందం. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదేశాల మేరకు ఈ మూడిటినీ రద్దు చేసుకుంటున్నట్లు మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ సోమవారం కీలక ప్రకటన చేశారు.

  కారణం అదే..

  కారణం అదే..

  సరిహద్దులో 20 మంది భారత జవాన్ల హత్యలకు నిరసనగానే చైనా సంస్థలతో ఒప్పందాలు రద్దు చేసుకున్నామని మహారాష్ట్ర ప్రభుత్వం స్పస్టం చేసింది. చైనా కంపెనీలకు కేటాయించిన మూడు ప్రాజెక్టులు తప్ప అమెరికా, సింగపూర్, సౌత్ కొరియా సంస్థలతో కుదుర్చుకున్న మిగతా తొమ్మిది ఒప్పందాలు యధావిధిగా కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చింది. గాల్వాన్ ఘర్షణల గురించి ముందే వెల్లడైఉంటే చైనా కంపెనీలతో అసలు ఒప్పందాలే చేసుకునేవాళ్లం కాదని మంత్రి దేశాయ్ చెప్పారు.

  కేంద్రం అనుమతితోనే..

  కేంద్రం అనుమతితోనే..

  చైనా కంపెనీలతో ఒప్పందాల రద్దుకు సంబంధించి కేంద్రంతో సంప్రదింపులు జరిపి, అనుమతి లభించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకున్నామని మహారాష్ట్ర సర్కారు పేర్కొంది. కరోనా అనంతర కాలంలో ‘ఆత్మనిర్భర్' నినాదంతో ముందుకు వెళదామన్న కేంద్ర సర్కారు.. వీలైనంత ఎక్కువగా దేశీయ ఉత్పత్తులనే ఉపయోగించాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీచేయడం, ఆ క్రమంలోనే రైల్వే శాఖ చైనా కంపెనీతో కుదుర్చుకున్న రూ.470కోట్ల ప్రాజెక్టును రద్దు చేసుకోవడం, టెలికాం శాఖ సైతం చైనా వస్తువులు వాడరాదని నిర్ణయించుకోవడం తెలిసిందే. మహారాష్ట్ర బాటలో మిగతా రాష్ట్రాలు కూడా చైనీస్ కంపెనీలతో ఒప్పందాలను రివ్యూ చేసుకునే అవకాశాలు లేకపోలేదు.

  English summary
  After the violent clash between India and China at Galwan Valley the nation raged with Boycott China slogans. Amid the protests against China, the Maharashtra government has put 3 Chinese deals worth Rs 5000 crores on hold
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more