వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: మోడీని ప్రశంసించిన చైనా మీడియా

సిక్కిం విషయంలో భారత్‌పై అవాకులు చవాకులు పేలుతూ రాతలు రాస్తున్న చైనా మీడియా అనుహ్యంగా భారత ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీజింగ్: సిక్కిం విషయంలో భారత్‌పై అవాకులు చవాకులు పేలుతూ రాతలు రాస్తున్న చైనా మీడియా అనుహ్యంగా భారత ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించింది.

భారత్‌లో తీసుకొచ్చిన జిఎస్‌టి పన్ను విధానం చారిత్రాత్మకమని కితాబునిచ్చింది. ఈ ఘటనత ప్రధాని నరేంద్రమోడీకే దక్కుతోందంటూ వ్యాఖ్యానించింది.

Amid Sikkim Standoff, Praise For PM Modi, GST By Chinese State-Run Media

అతి తక్కువ ఖర్చుతో కూడిన తయారీరంగం మెల్లగా చైనా నుండి వెళ్ళిపోతోంది. ఇప్పుడు భారత్‌కు క్లిష్టతరంగా మారనుంది. త్వరలో ప్రపంచమార్కెట్‌లో చైనాను భారత్ భర్తీ చేయగలదు అంటూ వార్తాసంస్థ గ్లోబల్ టైమ్స్ కథనాన్ని వెలువరించింది.

భారత్-చైనాకు సరిహద్దుగా ఉన్న సిక్కిం ప్రాంతం విషయంలో చైనా ప్రతిరోజూ భారత్‌కూ వ్యతిరేకంగా రెచ్చగొట్టే కథనాలు వెలువరిస్తోంది. అయితే ఆకస్మాత్తుగా గ్లోబల్ టైమ్స్ ఈ కథనం వెలువరించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

భారత్ మౌళిక వసతుల లేమి ఉంటుందని విధానాల అమల్లో ఆయా రాష్ట్రాల మధ్య ఇబ్బందులు ఎదురౌతూనే ఉంటాయని ఇదే భారత్‌కు కొంత వెనుకకులాగే అంశమని గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది.

అయితే ఈ సమస్యను కూడ ప్రస్తుతం భారత్ అధిగమిస్తోంందని కొత్త పన్ను భారత్ మేక్ వన్ ఇండియా కార్యక్రమానికి ఊపునిస్తోంది.

ఆయా రాష్ట్రాల మధ్య వైరుధ్యాలను ఈ కొత్త నిర్ణయం రూపుమాపుతోంది.కేంద్ర, రాష్ట్ర పన్నులను ఏకం చేస్తోంది. దీంతో కామన్ నేషన్ మార్కెట్ ఏర్పడుతోంది. దీంతో మౌలిక రంగంలో పోటీని కూడ అధిగమించనుంది. ప్రధాని మోడీ మేక్ ఇండియా కార్యక్రమం ప్రపంచమార్కెట్‌ను ఆకర్షించేందుకు మంచి చర్య అంటూ చైనా మీడియా వెల్లడించింది.

English summary
A Chinese state-run newspaper that typically trades in attacking Delhi today said that India is becoming more attractive to international investors and praised the landmark tax reform GST pushed through by Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X