వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: జీ20 సదస్సులో మోడీ, జిన్‌పింగ్ ఒకరిపై ఒకరు ప్రశంసలు

హాంబ‌ర్గ్: ఇరు దేశాల సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత ప్ర‌ధాని నరేండ్ర మోడీ, చైనా దేశాధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ ఒక‌రిపై ఒక‌రు ప్ర‌శంస‌లు కురిపించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

|
Google Oneindia TeluguNews

హాంబ‌ర్గ్: ఇరు దేశాల సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత ప్ర‌ధాని నరేండ్ర మోడీ, చైనా దేశాధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ ఒక‌రిపై ఒక‌రు ప్ర‌శంస‌లు కురిపించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. హాంబ‌ర్గ్‌లో జ‌రిగిన బ్రిక్స్ దేశాల నేతల స‌ద‌స్సులో మోడీ, జిన్‌పింగ్ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.

యుద్ధానికి సిద్ధమవుతోందా?: టిబెట్‌లో అడ్వాన్స్‌డ్ ట్యాంక్‌తో తీవ్ర కసరత్తులుయుద్ధానికి సిద్ధమవుతోందా?: టిబెట్‌లో అడ్వాన్స్‌డ్ ట్యాంక్‌తో తీవ్ర కసరత్తులు

ఒకరినొకరు మెచ్చుకోలు..

ఒకరినొకరు మెచ్చుకోలు..

సిక్కిం వివాదం నేపథ్యంలో జీ 20 సదస్సులో మోదీ, జిన్‌పింగ్‌లు కలిసి పాల్గొనడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. సదస్సుల్లో భాగంగా శుక్రవారం బ్రిక్స్‌ దేశాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మోడీ, జిన్‌పింగ్‌లు ఎదురుపడ్డారు. అయితే వీరిద్దరూ కలిసి మాట్లాడుకోలేదు కానీ.. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఉగ్ర‌వాద నిర్మూల‌న‌కు ప్ర‌ధాని మోడీ చేప‌డుతున్న చ‌ర్య‌లు ప్ర‌శంస‌నీయ‌మైని చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ అన్నారు. చైనా దేశాధ్య‌క్షుడిపైన కూడా మోడీ కామెంట్ చేశారు. జీ జిన్‌పింగ్ నేతృత్వంలో బ్రిక్స్ దేశాలు పాజిటివ్‌గా ముందుకు వెళ్తున్నాయంటూ చైనా అధ్య‌క్షుడిని మోడీ కొనియాడారు. అంతేగాక, ఈ ఏడాది చివర్లో చైనాలోని జియామెన్‌లో నిర్వహించే బ్రిక్స్‌ సదస్సుకు భారత్‌ పూర్తి మద్దతిస్తుందని తెలిపారు.

ఓ వైపు ఉద్రిక్తత-మరోవైవు ప్రశంసలు

ఓ వైపు ఉద్రిక్తత-మరోవైవు ప్రశంసలు

ఇటీవ‌ల భార‌త్‌, చైనా మ‌ధ్య బోర్డ‌ర్ స‌మ‌స్య త‌లెత్తిన నేప‌థ్యంలో రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ విషయం తెలిసిందే. అంతేగాక, చైనా మీడియా కూడా భారత్ పై తీవ్ర అక్కసు వెళ్లగక్కుతోంది. సిక్కింకు స్వాతంత్ర్యం కోసం మద్దతిస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. భారత్ కూడా చైనాకు ధీటుగా జవాబు చెప్పుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో, ఇరు దేశాధినేత‌లు మాత్రం ఆ టెన్ష‌న్ ప్ర‌ద‌ర్శించుకుండానే ఒక‌రిపై ఒక‌రు ప్ర‌శంస‌లు కురిపించుకోవడం గమనార్హం. జిన్‌పింగ్.. భారత్ సాధిస్తున్న ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధిని మెచ్చుకున్నారు. మున్ముందు కూడా మరింత వృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సమావేశం అనంతరం ఇరుదేశాధినేతలు కరచాలనం చేసుకొని కాసేపు ముచ్చటించుకున్నారు.

నిలువరించాల్సిందే..

నిలువరించాల్సిందే..

బ్రిక్స్ దేశాధినేత‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఉగ్ర‌వాదం, ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ అంశాల‌పై బ్రిక్స్ దేశాలు గ‌ట్టి వాక్కు వినిపించాల‌ని మోడీ అన్నారు. ఉగ్ర‌వాదుల‌కు నిధుల‌ను స‌మ‌కూరుస్తున్న దేశాల‌ను, ఉ్ర‌గ కార్య‌కలాపాల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న దేశాల‌ను నిలువ‌రించాల‌ని మోడీ పిలుపునిచ్చారు.

సంస్కరణల దిశగా భారత్

సంస్కరణల దిశగా భారత్

ఇటీవ‌ల భార‌త్‌లో జీఎస్టీ అమ‌లు చేశామ‌ని, 70 ఏళ్ల స్వతంత్ర భార‌తంలో ఇది అతిపెద్ద సంస్క‌ర‌ణ అని మోడీ చెప్పారు. దీని వ‌ల్ల వ్యాపారం విస్తృతంగా వృద్ధి సాధించగలదని మోడీ వివరించారు. కాగా, హాంబర్గ్‌ వేదికగా జీ20 సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు మోడీ, జిన్‌పింగ్‌లతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌, బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే, జపాన్‌ ప్రధాని షింజో అబే, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్‌ మేక్రాన్‌ తదితర ప్రపంచ నేతలు హాజరయ్యారు. వీరికి జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ సాదర స్వాగతం పలికారు.

సిక్కిం స్వాతంత్య్రానికి మద్దతిస్తాం: చైనా మీడియా బరితెగింపుసిక్కిం స్వాతంత్య్రానికి మద్దతిస్తాం: చైనా మీడియా బరితెగింపు

English summary
Amidst the stand off, the Chinese President Xi Jinping appreciated India's strong resolve against terrorism. He also said that thanks to India there was momentum introduced in the BRICS. The statement was made at the G20 summit that began on Friday at Hamburg.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X