వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ డబ్బులు మాయం -హ్యాకర్ల పంజా - రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్ నుంచి గుట్టుగా..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ హ్యాకర్లు పంజా విసిరారు.. ఏకంగా అధికార రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్లలోకి చొరబడ్డారు.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీ-ఎలక్షన్ కోసం సేకరించిన నిధుల్ని గుట్టుగా కాజేశారు.. సంచలనంగా మారిన ఈ ఘటనపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఎఫ్‌బీఐ)కు ఫిర్యాదు చేశామని సాక్ష్యాత్తూ రిపబ్లికన్ పార్టీ నేతలే మీడియాకు చెప్పారు. వివరాల్లోకి వెళితే..

Recommended Video

US Election 2020: ట్రంప్ పై పై చేయి సాధించేలా భారతీయ అమెరికన్లను సలహాదారులుగా నియమించుకున్న బిడెన్‌!

బీహార్‌లో హంగ్: బీజేపీ-ఆర్జేడీ పొత్తుపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు - నితీశ్‌కు ఆప్షన్ లేదన్న రవిశంకర్బీహార్‌లో హంగ్: బీజేపీ-ఆర్జేడీ పొత్తుపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు - నితీశ్‌కు ఆప్షన్ లేదన్న రవిశంకర్

అక్కడ 10 ఎలక్టోరల్ ఓట్లు..

అక్కడ 10 ఎలక్టోరల్ ఓట్లు..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాపులర్ ఓటు(ప్రజల ఓటు) కంటే ఎలక్టోరల్ ఓట్లు(ప్రజాప్రతినిధుల ఓట్లు) కీలకమన్న సంగతి, గత ఎన్నికల్లో ట్రంప్ కంటే ఎక్కువ పాపులర్ ఓట్లు సాధించిన హిల్లరీ క్లింటన్.. ఎలక్టోరల్ తేడాతో ఓడిపోవడం తెలిసిందే. అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేసే రాష్ట్రాల్లో విస్కాన్సిన్ కూడా ఒకటి. విస్కాన్సిన్‌లో 10 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఈ క్రమంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఈ రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ట్రంప్ పునరెన్నికల ఖర్చు కోసం రిపబ్లికన్ పార్టీ నేతలు విరాళాల రూపంలో భారీగా డబ్బును సేకరించగా..

2.3 మిలియన్లు మాయం..

2.3 మిలియన్లు మాయం..

ట్రంప్ రీ-ఎలక్షన్ కోసం సేకరించిన డబ్బును విస్కాన్సిస్ రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్‌లో జమచేశారు. అవకాశం కోసం మాటు వేసిన సైబర్ నేరగాళ్లు.. రిపబ్లికన్ పార్టీ అకౌంట్‌ ను హ్యాక్ చేసి, అందులో జమ చేసిన డబ్బును దొంగిలించారు. ఈ విషయాన్ని విస్కాన్సిస్ రిపబ్లికన్ పార్టీ చైర్మన్ ఆండ్రూ హిట్టే మీడియాకు తెలిపారు. సుమారు 2.3 మిలియన్ డాలర్లను హ్యాకర్లు కాజేశారని, అక్టోబర్ 22న అనుమానాస్పద లావాదేవీలు జరిగనట్లు గుర్తించామని ఆయన చెప్పారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేశామని, ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైందని హిట్టే పేర్కొన్నారు. చేసినట్లు చెప్పారు. ఎఫ్‌బీఐ దర్యాప్తును కూడా ప్రారంభించిందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే..

చరిత్రలోనే ఖరీదైన ఎన్నికలు.

చరిత్రలోనే ఖరీదైన ఎన్నికలు.

అమెరికాలో ఈసారి జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు చరిత్రలోనే ఖరీదైనవిగా రికార్డులకెక్కాయి. 2020 ఎన్నికలకు దాదాపు 14 బిలియన్ డాలర్ల(రూ. లక్షా 3 వేల కోట్లకు పైగా) ఖర్చు అయినట్టు సెంటర్ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్ రిపోర్ట్ అంచనా వేస్తోంది. 2012, 2016 ఎన్నికల ఖర్చును కలిపినా ఈ ఎన్నికల ఖర్చు కంటే తక్కువగానే ఉన్నట్టు రిపోర్ట్ చెబుతోంది. ఈ సారి ఎన్నికలకు 11 బిలియన్ డాలర్ల(రూ. 81 వేల కోట్లకు పైగా) వరకు ఖర్చయ్యే అవకాశముందని ముందుగా అంచనా వేశారు. అయితే అంచనాలకు మించి ఎన్నికల ఖర్చు అవడం విశేషం. ట్రంప్, జో బైడెన్ మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. దీనికి తోడు కరోనా అంశం అమెరికా ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ట్రంప్‌కు ఫండ్‌రైజింగ్ ద్వారా 596 మిలియన్ డాలర్లు(రూ. 4,415 కోట్లు) వచ్చాయి. మొత్తంగా రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచారానికి 3.8 బిలియన్ డాలర్ల(రూ. 28 వేల కోట్లకు పైగా)ను ఖర్చు చేసింది. అందులో కొంత భాగాన్ని విస్కాన్సిస్ రిపబ్లికన్ పార్టీ అకౌంట్ నుంచి హ్యాకర్లు తస్కరించారు.

షాకింగ్: 6నెలల్లో జగన్ 114 శాతం అప్పులు -కేసీఆర్‌తో చర్చలు -ఏపీ పోలీసులపైనా వైసీపీ ఎంపీ ఆరోపణలుషాకింగ్: 6నెలల్లో జగన్ 114 శాతం అప్పులు -కేసీఆర్‌తో చర్చలు -ఏపీ పోలీసులపైనా వైసీపీ ఎంపీ ఆరోపణలు

English summary
Hackers reportedly stole $2.3 million from the Wisconsin Republican Party just weeks before the election using a scheme involving manipulated invoices. The group noted the theft on October 22nd; Wisconsin Republican Party Chairman Andrew Hitt says that the FBI is currently investigating the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X