వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాపై అణుబాంబు? ఇరాన్ కీలక నిర్ణయం? ట్రంప్ వార్నింగ్ తర్వాత మారిన సీన్

|
Google Oneindia TeluguNews

దారికి రాకుంటే మరిన్ని భీకర దాడులు తప్పవంటూ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చిన కొద్దసేపటికే ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఏ కారణంచేతైతే తమను అమెరికా టార్గెట్ చేసిందో.. ఆ అణు కార్యక్రమాల్ని మళ్లీ మొదలు పెట్టాలని ఇరాన్ భావిస్తోంది. ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అబ్బాస్ మౌసావి ఆదివారం చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది.

అణు బాంబు తయారీ?

అణు బాంబు తయారీ?

ఇరాన్ పర్యటనలో ఉన్నఇరాన్ ఆర్మీ జనరల్ ఖాసిం సులేమానిని అమెరికా డ్రోన్ దాడితో అంతం చేసిన తర్వాత ప్రపంచమంతటా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్.. ఆమేరకు బగ్దాద్ లోని యూఎస్ ఎంబసీ టార్గెట్ గా డ్రోన్ దాడులు చేసింది. అంతటితో ఆగొద్దని, అమెరికా వణికిపోయే రీతిలో అణ బాంబుల్ని కూడా సిద్ధం చేయాలని ఇరాన్ పాలకులు యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తయారుచేసిన బాంబుల్ని ప్రదర్శించడంతోపాటు కొత్తగా తయారుచేయాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

అధికారి ప్రకటనతో..

అధికారి ప్రకటనతో..

2015లో అమెరికాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇరాన్ తన అణుకార్యక్రమాల్ని గణనీయంగా తగ్గించుకుంది. తద్వారా ఐక్యరాజ్యసమితి ఆంక్షల నుంచి బయటపడొచ్చని భావించింది. కానీ ట్రంప్ ఎంట్రీతో సీన్ పూర్తిగా మారిపోయింది. ఇరాన్ తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు 2018లో ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం రెండు దేశాలు దాడులు చేసుకుంటున్న పరిస్థితిలో అణు కార్యక్రమన్ని మళ్లీ ప్రారంభించే అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటన చేశారు.

ఈసారి దాడిచేస్తే బూడిదే..

ఈసారి దాడిచేస్తే బూడిదే..

అమెరికాను టార్గెట్ చేస్తూ మరోసారి దాడులకు పాల్పడితే ఇరాన్ ను బూడిద చేస్తామని, గతంలో ఎన్నడూ చూడని రీతిలో విరుచుకుపడతామని ట్రంప్ ఆదివారం వార్నింగ్ ఇచ్చారు. అమెరికాకు శత్రువులుగా ఉన్న ఎవర్నైనాసరే సులువుగా వదిలిపెట్టబోమని, వేటాడిమరీ అంతం చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

English summary
Iran decide on next step to further roll back its commitments to a 2015 nuclear deal with major powers, Iranian Foreign Ministry spokesman told media On Sunday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X