వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రాన్స్ విమానానికి కెమికల్ బాంబుల బెదిరింపు: యుఎస్ జెట్ ఫైటర్స్ ఎస్కార్ట్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికా వెళుతున్న విమానంలో కెమికల్ బాంబులు ఉన్నాయని, పేల్చేస్తామని బెదిరింపు ఫోన్ రావడంతో యుఎస్ అధికారులు హడలిపోయారు. ఆ విమానం వెంట రెండు యుద్ద విమానాలు పంపించి ఎయిర్ పోర్టులో సోదాలు చేయించారు.

సోమవారం రాత్రి ప్యారీస్ నుండి న్యూయార్క్ కు ఎయిర్ ఫ్రాన్స్ ప్యాసింజర్ జెట్ విమానం బయలుదేరింది. అదే సమయంలో అమెరికా పోలీసు అధికారులకు ఒక బెదిరింపు ఫోన్ కాల్ వెళ్లింది. వెంటనే ఎఫ్ బీఐ అధికారులు ఎయిర్ పోర్టులోని అధికారులు, సిబ్బందిని అలర్ట్ చేశారు.

ప్యారిస్ నుండి వస్తున్న విమానానికి తోడుగా రెండు అమెరికా యుద్ద విమానాల (యూఎస్ ఎఫ్-15)ను ఎస్కార్ట్ గా ఎఫ్ బీఐ అధికారులు పంపించారు. ఫ్రాన్ విమానం దిగే జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు యుద్దవిమానాలు ఎస్కార్ట్ గా వెళ్లాయి.

 An Air France flight from Paris to New York, US Fighter jets escort

ఈ సందర్బంగా ఎఫ్ బీఐ అధికారులు స్పందించారు. ఫ్రాన్స్ విమానాన్ని కెమికల్ ఆయుధాలు, కెమికల్ బాంబులుతో పేల్చేస్తామని బెదిరింపు ఫోన్ రావడంతో తాము ముందు జాగ్రత చర్యగా యుద్దవిమానాలను ఎస్కార్ట్ గా పంపించామని స్పష్టం చేశారు.

ఎయిర్ పోర్టులో ఫ్రాన్స్ విమానం క్షేమంగా దిగిందని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఎఫ్ బీఐ అధికారులు తెలిపారు. ఫ్రాన్స్ విమానాన్ని ఎయిర్ పోర్టులోని ఒక ప్రాంతానికి తీసుకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి కెమికల్ ఆయుధాలు లేవని యుఎస్ అధికారులు తెలిపారు. అమెరికాలోని మ్యారిల్యాండ్ ప్రాంతం నుండి బెదిరింపు ఫోన్ వచ్చిందని అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది.

English summary
An Air France passenger jet flying from Paris to New York has been escorted by two US fighter planes for the last leg of its trip after a bomb threat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X