వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

70 వేల ఏళ్ల క్రితం ఆకాశంలో అద్భుతం! సూర్యుడిపైకి తోకచుక్కలను పంపిన ఏలియన్ స్టార్!?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: దాదాపు 70 వేల సంవత్సరాల క్రితం ఆకాశంలో జరిగిన ఓ అద్భుతాన్ని అంతరిక్ష పరిశోధకులు తాజాగా వెలుగులోనికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఆశ్చర్యకరమైన నిజాలను వెల్లడించారు. అదేమిటంటే.. అతి చిన్న ఏలియన్‌ నక్షత్రం ఒకటి మన సౌర కుటుంబం మధ్యలోకి తోక చుక్కలను, గ్రహ శకలాలను పంపించిందట.

ఈ ఏలియన్ నక్షత్తం పేరు స్కోల్జ్ స్టార్ లేదా బైనరీ స్టార్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, ఆ సమయంలో (70 వేల సంవత్సరాల క్రితం) భూమ్మీది ఆఫ్రికా ఖండం పరిసర ప్రాంతాల్లో నివసించడం ప్రారంభించిన మన పూర్వీకులు ఆ ఏలియన్ నక్షత్రాన్ని స్వయంగా తమ కళ్లతో వీక్షించారనేది వారి వాదన.

అసలేంటీ ఈ ఏలియన్ నక్షత్రం?

అసలేంటీ ఈ ఏలియన్ నక్షత్రం?

దాదాపు 70 వేల సంవత్సరాల క్రితం.. స్కోల్జ్‌ స్టార్‌ లేదా బైనరీ స్టార్‌ అనే అతి చిన్న ఏలియన్‌ నక్షత్రం ఒకటి ఏకంగా మన సౌర కుటుంబం మధ్యలోకి తోక చుక్కలను, గ్రహ శకలాలను పంపించిందని తాజాగా అంతరిక్ష పరిశోధకులు కనుగొన్నారు. ఈ ఏలియన్ నక్షత్రం ఆకాశంలో ఎరుపు రంగులో ప్రకాశిస్తూ భూమ్మీది నుంచి చూసిన మన పూర్వీకులకు కనిపించిందని వారు పేర్కొంటున్నారు.

సౌరకుటుంబంలో ఇప్పటికీ ఆ ఆనవాళ్లు...

సౌరకుటుంబంలో ఇప్పటికీ ఆ ఆనవాళ్లు...

మన సౌరకుటుంబంలో ఇప్పటికీ ఏలియన్ నక్షత్రానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయట. ఈ విషయాన్ని కంప్లూటెన్స్‌ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జి అంతరిక్ష పరిశోధకులు పేర్కొన్నారు. సౌర కుటుంబంలోని హైపర్‌బోలిక్‌ ఆర్బిట్స్‌లో తిరుగుతున్న 340 శకలాలను జాగ్రత్తగా పరిశీలించి తాము ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నామని వారు చెబుతున్నారు.

ఏలియన్ నక్షత్రాన్ని వీక్షించిన పూర్వీకులు?

ఏలియన్ నక్షత్రాన్ని వీక్షించిన పూర్వీకులు?

ఆకాశంలో ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఈ ఏలియన్ స్టార్ భూమ్మీది నుంచి చూసిన మన పూర్వీకులకు కనిపించిందని, ఆ సమయంలో ఆ నక్షత్రం సూర్యుడికి ఒక కాంతి సంవత్సరం కన్నా తక్కువ దూరంలోకి రావడం వల్లే భూమ్మీది మానవులు ఆ దృశ్యాన్ని చూడగలిగారని శాస్తవేత్తలు పేర్కొంటున్నారు.

‘వీ' ఆకారంలో కక్ష్యలు...

‘వీ' ఆకారంలో కక్ష్యలు...

ఈ ఏలియన్ నక్షత్రాన్ని 2015లో అంతరిక్ష పరిశోధకులు కనుగొన్నారు. సాధారణంగా సౌరకుటుంబంలోని గ్రహాలన్నీ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. అయితే ఈ కక్ష్య మాత్రమే కాకుండా సూర్యుడికి చేరువలో ‘వీ' ఆకారంలో ఉన్న కక్ష్యలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కక్ష్యల్లోనే ఓర్ట్ తోకచుక్కలు తిరిగినట్లు వారు నిర్ధారణకు వచ్చారు.

సౌర కుటుంబం చుట్టూ ఓర్ట్ మేఘం...

సౌర కుటుంబం చుట్టూ ఓర్ట్ మేఘం...

అంతరిక్షంలోని మన సౌర కుటుంబం చుట్టూ ఓ మేఘం ఆవరించి ఉండేదట. దీనిని ఓర్ట్ క్లౌడ్‌గా శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. నిజానికి ఇదొక ఊహాజనిత ప్రదేశం. విశ్వం ఆవిర్భావం నుంచే ఈ ఓర్ట్ మేఘంలో ట్రిలియన్ల కొద్దీ తోక చుక్కలు ఉండేవట. వీటిలో కొన్ని అప్పుడప్పుడూ గతి తప్పి సౌర కుటుంబంలోని గ్రహాలవైపు వచ్చేవట.

 ఏలియన్ నక్షత్ర ప్రభావంతో...

ఏలియన్ నక్షత్ర ప్రభావంతో...

సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి ఎక్కడ అంతమవుతుందన్న విషయాన్ని ఈ ఓర్ట్ తోక చుక్కల ద్వారా తెలుసుకోవచ్చని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. స్కోల్జ్ అనే ఏలియన్ నక్షత్రం ప్రభావం వల్లే ఈ ఓర్ట్ తోకచుక్కలు గతి తప్పి సూర్యుడికి అతి చేరువగా వెళ్లాయని వారు పేర్కొంటున్నారు.

English summary
Some 70,000 years ago, when humans and Neanderthals shared the planet, an alien star streaked through the outer edges of our solar system and jostled its contents, astronomers say. In a study of hundreds of solar system objects with unusual orbits, the scientists also noted eight comets that may have interstellar origins. This idea that a star recently sideswiped our solar system was first raised three years ago by University of Rochester astronomer Eric Mamajek. He and his colleagues had noticed something strange while studying a binary stellar system named Scholz's star, which comprises two small, dim stars orbiting each other. Even though Scholz's star is just 20 light-years from Earth — a near neighbor, by astronomical standards — it appeared to move incredibly slowly across the night sky. Unlike most planets, asteroids and the like, which journey around the sun on elliptical paths, bodies with hyperbolic orbits track a V-shaped path through the solar system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X