వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా దారుణాలు..! స్కూల్లో ఉన్న చిన్న పిల్లలపై కత్తులతో దాడి ..! 8మంది విద్యార్థులు మృతి...!

|
Google Oneindia TeluguNews

స్కూల్లో పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులపై ఓ ఉన్మాదీ విచక్షణ రహితంగా వ్యవహరించాడు. ఒక్కసారిగా స్కూల్లోకి చొరబడి అభం శుభం తెలియని విద్యార్థులపై కత్తులతో వీరంగం సృష్టించాడు. దీంతో ప్రాధమిక పాఠశాలలో ఏం జరుగుతుందో తెలిసేలోపే రక్తపుటేరులు పారాయి. ఉన్మాది కత్తిపోట్లకు ఎనిమిది విద్యార్థులు బలయ్యారు. మరికొంతమంది గాయపడ్డారు.

వామ్మో కొత్త ట్రాఫిక్ రూల్స్..! నిబంధనలు ఉల్లంఘించిన టూవీలర్‌కు రూ. 23000 జరిమానా...!వామ్మో కొత్త ట్రాఫిక్ రూల్స్..! నిబంధనలు ఉల్లంఘించిన టూవీలర్‌కు రూ. 23000 జరిమానా...!

సెంట్రల్ చైనాలో ఈ దారుణం చోటుచేసుకుంది. హూబే ప్రావిన్స్‌లోని బైయాంగ్‌పింగ్ అనే ప్రాంతలో ఓ ప్రైమరీ పాఠాశాలలో కొత్త సెమిస్టర్ ‌లో స్కూల్ ప్రారంభమైన మొదటి అనగా సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు 40 సంవత్సరాలు ఉండే ఓ మాజీ ఖైదీ స్కూల్లోకి చొరబడి విద్యార్థులపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో ఎనిమిది మంది విద్యార్థులు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

An attacker killed eight students at an elementary school in central China

అయితే దాడికి పాల్పడ్డ నిందితుడు గతంలో ఓ దుర్మార్గానికి ఒడిగట్టాడు. తన ప్రేయసిపై దాడి చేసి ఆమే కళ్లను పీకేందుకు ప్రయత్నాలు చేశాడు. దీంతో ఆకేసులో ఎనిమిది సంవత్సరాల పాటు జైలు జీవీతం అనుభవించి సంవత్సరం క్రితమే బయటకు వచ్చాడు.అయితే నిందుతుడు ఎందుకు ఈదాడి చేశాడనే కారణాలు స్పష్టంగా తెలియలేదు. ఇదే ప్రాంతలో గత సంవత్సరం కూడ విద్యార్థులపై దాడులు జరిగాయి. ఏప్రిల్‌ నెలలో ఇద్దరు విద్యార్థులను పోడిచి చంపగా, జూన్‌లో కూడ తొమ్మిది మందిపై దాడి చేసి చంపారు. ఈ నేపథ్యంలోనే స్కూళ్ల వద్ద గట్టి భద్రతా చర్యలు చేపట్టాని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

English summary
An attacker killed eight students and injured two others at an elementary school in central China on the first day of the new semester, police said Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X