India
 • search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

7.5 తీవ్రతతో పెను భూకంపం: 16వ శతాబ్దం నాటి చారిత్రాత్మక చర్చి నేలమట్టం

|
Google Oneindia TeluguNews

లిమా: లాటన్ అమెరికన్ దేశం పెరూలో పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రతకు తీర ప్రాంతాల్లో భయాందోళనలకు వ్యక్తం అయ్యాయి. సునామీ సంభవించే అనుమానాలు తలెత్తాయి. అలాంటి ప్రమాదం ఏదీ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. భూకంపం ధాటికి పలు భవనాలు బీటలు వారాయి. రహదారుల్లో చీలికలు ఏర్పడ్డాయి. పలుచోట్ల భూమిలోకి కుంగిపోయాయి. ఇప్పటిదాకా ప్రాణనష్టం సంభవించినట్లు వార్తలు రాలేదు.

భారత కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున పెరూ ఉత్తర ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.5గా రికార్డయింది. 7.5 అనేది అసాధారణ తీవ్రతగా భావిస్తారు జియాలజిస్టులు. పెరూ ఉత్తర ప్రాంతంలోని అమెజాన్ రీజియన్‌ను భూకంప కేంద్రంగా గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పెరూ తీర ప్రాంత నగరం బర్రాంకాకు వాయవ్య దిశగా 42 కిలోమీటర్ల దూరంలో..ఉపరితలం నుంచి 112 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న పెను మార్పులు, కదలికల వల్ల ఈ భూకంపం సంభవించినట్లు పేర్కొంది.

భూకంపం తీవ్రతకు 16వ శతాబ్దం నాటి చర్చి నేలమట్టమైంది. అమెజాన్ రీజియన్‌లోని లా జల్కా ప్రాంతంలో ఉంటుందీ చర్చి. 500 సంవత్సరాల కిందట దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పటిదాకా ఎన్నో భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని నిలిచింది. ఈ దఫా 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి కుప్పకూలింది. పూర్తిగా నేలమట్టమైంది. ఈ ఘటనలో ముగ్గురు చర్చి సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.

An earthquake with magnitude of 7.5 struck northern Peru, damaging some buildings

ఈ విషయాన్ని లా జల్కా మేయర్ వాల్టర్ కల్క్వీ నిర్ధారించారు. ప్రభుత్వ అధికార రేడియో ఆర్పీపీలో ఓ ప్రకటన చేశారు. భూకంపం తీవ్రతకు అమెజాన్‌తో పాటు కజమర్కా రీజియన్‌లోనూ పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. రోడ్లు చీలిపోయాయి. పలు చోట్ల రోడ్లు కుంగిపోయాయి. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్పంగా ప్రకంపనలు నమోదు అయ్యాయి. ఫలితంగా- కొన్ని గంటల పాటు స్థానికులు ఆరుబయటే భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ గడిపారు.

  5.1 తీవ్రతతో Earthquake.. AP, Tamil Nadu లోని పలు ప్రాంతాల్లో కంపించిన భూమి..! || Oneindia Telugu

  పెరూకు ఆనుకుని ఉన్న ఈక్వెడార్‌లోని లోజా మున్సిపాలిటీలోనూ ఈ భూకంపం తీవ్రత కనిపించింది. లోజా సిటీలో కొన్ని భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌ పరిధిలో ఉంటుంది పెరూ. భూగోళం మీద సంభవించే భూకంపాల్లో 85 శాతం ఈ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలోనే సంభవిస్తుంటాయంటే దీని తీవ్రత ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. పెరూలో భూకంపాలు సర్వ సాధారణం. ఈ స్థాయి తీవ్రతతో మాత్రం రావడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి.

  English summary
  An earthquake with a preliminary magnitude of 7.5 struck northern Peru early Sunday, damaging some buildings and blocking several roads with rubble.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X