• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిత్రం విచిత్రం : 3 రోజుల 'పెళ్లి' సందడి.. 3 నిమిషాల్లో "విడాకులు"

|

కువైట్ : వివాహబంధంతో ఇద్దరు మనుషులు ఏకం కావడానికి ఎంత పెద్ద తతంగం ఉంటుందో తెలుసుగా. పెళ్లి చూపులు మొదలు వివాహం అయ్యేంతవరకు ఆ సందడి అంతా ఇంతా కాదు. బంధుమిత్రుల రాకపోకలతో ఆ ఇంటి వాతావరణం సంతోషాలతో నిండిపోతుంది. అంత గొప్పగా జరిగే వివాహ వేడుకను క్షణికావేశంతో కొందరు అవహేళన చేస్తున్నారు. కువైట్ లో జరిగిన ఓ ఘటన వైరల్ గా మారడంతో వింత పెళ్లి తతంగం బయటి ప్రపంచానికి తెలిసింది. మూడు రోజులు అన్నీ ఏర్పాట్లు చేసుకుని తీరా పెళ్లయ్యాక కేవలం మూడు నిమిషాల్లో విడాకులు తీసుకోవడం చర్చానీయాంశమైంది.

ఆయన అరిచాడు.. ఈమె కాదంది

ఆయన అరిచాడు.. ఈమె కాదంది

పెళ్లి అలా జరిగిందో లేదో ఇలా విడాకులు కోరింది ఓ యువతి . నెల రోజుల కిందట కువైట్ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లేంటి, విడాకులేంటి? అనుకుంటున్నారా? క్షణికావేశంతో పెళ్లికొడుకు నవవధువుపై అరవడం, వెంటనే ఆమె విడాకులు కోరడం, జడ్జి మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. పెళ్లయిన మరుక్షణమే అంతలా అరిస్తే నువ్వు నాతో కలిసి కాపురం ఎలా చేస్తావనేది నవవధువు పాయింట్.

నువ్వెంతంటే నువ్వెంత..!

నువ్వెంతంటే నువ్వెంత..!

పెళ్లికి సిద్ధమైన ఓ యువజంట.. వివాహానికి సంబంధించి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పత్రాలపై జడ్జి ఎదుట సంతకాలు పెట్టాల్సి ఉంది. అలా జడ్జి ఎదుట హాజరై కోర్టు హాల్ నుంచి బయటకొచ్చే క్రమంలో నవవధువు పొరపాటున జారిపడింది. ఆ సమయంలో ఆమెకు చేయందించి సాయం చేయాల్సింది పోయి.. తిట్ల పురాణం మొదలుపెట్టాడు పెళ్లికొడుకు. దాంతో చిర్రెత్తుకొచ్చిన పెళ్లికూతురు తానేమీ తక్కువ కాదంటూ నిరూపించుకుంది. వెంటనే కోర్టు లోపలికి వెళ్లి విడాకులు కావాలంటూ జడ్జిని అభ్యర్థించింది. పెళ్లికొడుకుకు చాలా కోపం ఉందంటూ ఆమె చేసిన ఫిర్యాదుతో ఏకీభవించిన సదరు జడ్జి.. డైవోర్స్ గ్రాంటెడ్ అంటూ తీర్పునిచ్చారట.

ప్రపంచంలో ఇదే రికార్డా?

ప్రపంచంలో ఇదే రికార్డా?

పెళ్లి తతంగంలో భాగంగా దాదాపు 3 రోజుల నుంచి అన్నీ సిద్ధం చేసుకుందట ఆ యువజంట. ఇక పెళ్లి జరిగి కాపురం పెట్టడమే తరువాయి అనే రీతిలో అన్నీ సమకూర్చుకున్నారు. కానీ పెళ్లయ్యాక కేవలం 3 నిమిషాల్లోనే విడాకులు కావడం వారి బంధుమిత్రులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలా అతి తక్కువ సమయంలో విడాకులు తీసుకున్న జంటగా కువైట్ డైరీలో వీరిద్దరికి ఒక పేజీ దక్కిందనేది స్థానిక మీడియా కథనం. ఇదివరకు దుబాయ్ లో ఇలాగే ఓ జంట క్షణికావేశంతో డైవోర్స్ తీసుకున్నారు. వారు పెళ్లయ్యాక 15 నిమిషాల వ్యవధిలో ప్యాకప్ చేప్పేశారు. కానీ కువైట్ లో తాజాగా జరిగిన విడాకుల ఘటన కేవలం 3 నిమిషాల్లోనే ముగియడం విస్మయం కలిగిస్తోంది. అంతేకాదు ప్రపంచంలో అత్యంత వేగంగా డైవోర్స్ అయిన జంట కూడా వీరే కావొచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As to knowing how big a bond is to be joined by two persons in marriage. It's not all that time until marriage starts to get married. The atmosphere of the house is filled with happiness by the relatives and friends. Some are being mocked with the momentum of a great wedding ceremony. An event in Kuwait has become viral. After three days all of the arrangements were made and got married a couple was just three minutes after the divorce was taken place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more