వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌పోర్టులో మామిడి పండ్లు దొంగిలించిన ఉద్యోగి... దేశ బహిష్కరణ... 5000 దిర్హామ్‌ల జరిమాన ..!!

|
Google Oneindia TeluguNews

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేస్తున్న ఓ భారతీయ యువకుడు వింత కేసును ఎదుర్కోన్నాడు.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి బ్యాగు నుండి రెండు మామిడి పళ్లను దోంగిలించాడనే ఆరోపణల నేపథ్యంలో విచారించిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ న్యాయస్థానం ఆ యువకున్ని కఠినంగా శిక్షించింది. నేరం రుజువు కావడంతో యువకున్ని దేశం నుండి బహిష్కరిస్తూ 5000 దిర్హామ్‌లు జరిమాన విధించింది.

దాహం వేస్తుందని మామిడి పండ్లను తీసుకున్న ఉద్యోగి

దాహం వేస్తుందని మామిడి పండ్లను తీసుకున్న ఉద్యోగి

అసలే దుబాయ్, ఆపైన అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, కోట్ల రుపాయల వ్యాపారులు ఆ దేశానికి వస్తూ పోతుంటారు. దీంతో ప్రయాణికుల భద్రత వ్వవహారాలను చూడాల్సిన బాద్యత ఎయిర్‌పోర్టు అధికారులకు ఉంటుంది.. ఈ నేపథ్యంలోనే దుబాయ్ ఎయిర్ పోర్టులో పనిచేసే ఓ 27 ఏళ్ల భారతీయ ఉద్యోగి కొంచం కక్కుర్తి పడ్డాడు. తనకు విపరీతంగా దాహం వేస్తుందడడంతో ఓ ప్రయాణికుడి బ్యాగులో నుండి రెండు మామిడి కాయాలు దొంగిలించాడు. అయితే తాను తీసుకున్న రెండు మామిడి పళ్ల వివరాలకు సంబంధించి ప్రయాణికుడు కూడ ఎలాంటీ ఫిర్యాదు కూడ చేయలేదు. కాని ఉద్యోగిపై మాత్రం దోంగతనం కేసు మాత్రం నమోదైంది.

సీసీ కెమేరాల్లో రికార్డ్ అయిన దోంగతనం దృశ్యాలు

సీసీ కెమేరాల్లో రికార్డ్ అయిన దోంగతనం దృశ్యాలు

అయితే ఉద్యోగి, విమానాశ్రయంలోని ప్రయాణికుడి బ్యాగును ఓపేన్ చేసి తెరిచి చూస్తున్న విషయాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కెమెరాల రోటిన్ చెకప్‌లో భాగంగా ఉద్యోగి రెండు మామిడి కాయలు తీస్తున్న దృశ్యాలు రికార్డ్ కావడంతో ఎయిర్‌పోర్టు పోలీసులు ఉద్యోగిని పిలిపించి విచారించారు. చేసిన నేరాన్ని సదరు ఉద్యోగి ఒప్పుకోవడంతో 2017 ఆగస్టులో కేసు నమోదు చేశారు. 6 దీర్హమ్‌ల విలువ గల మామిడి పళ్లను దోంగించాడని పేర్కోన్నారు. దీంతో సుమారు రెండు సంవత్సరాల పాటు కేసుపై విచారణ కొనసాగింది.

అప్పీలుకు 15 రోజుల సమయం

అప్పీలుకు 15 రోజుల సమయం

ఈ నేపథ్యంలోనే తుది తీర్పు సెప్టెంబర్ 23న వెలువడింది... ఈ కేసును దుబాయ్‌కు చెందిన పస్ట్‌ ఇన్‌స్టాన్స్‌ కోర్టు విచారించి తమ తుది తీర్పును వెల్లడించింది. నేరం రుజువైన యువకునికి 5000 దిర్హామ్‌ల జరిమానాతో పాటు దేశ బహిష్కరణ విధించింది. కాగా, కోర్టు ఇచ్చిన తీర్పుపై 15 రోజుల్లోగా పైకోర్టుకు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉద్యోగికి ఉంటుందని తెలిపింది.

English summary
An Indian man working at the Dubai International Airport banned from Dubai by court for stealing two mangoes from the baggage of a traveller.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X