ఖండంతరాలు దాటిన ప్రేమ: టర్కీ మహిళతో ఆంధ్రా యువకుడి పెళ్లి..
ప్రేమ అనంతమైంది. కుల, మతాల పట్టింపు లేదు. ఎల్లాలు దాటి మరీ ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తెలుగు కుర్రాడు, ఫారిన్ అమ్మాయి... విదేశీ అబ్బాయి, తెలుగు అమ్మాయిల వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో పెళ్లి జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అబ్బాయిని.. టర్కీష్ మహిళ ఒక్కటయ్యారు. హిందు సంప్రాదాయం ప్రకారం వారి పెళ్లి జరిగింది.

గుంటూరు అబ్బాయి..
గుంటూరుకు చెందిన మధు సంకీర్త్ టర్కీకి చెందిన గిజెమ్ కలిసి పనిచేశారు. 2016లో తొలిసారి కలిసి ప్రాజెక్టులో వర్క్ చేశారు. వారిద్దరూ క్లోజ్‌గా వర్క్ చేశారు. తర్వాత మధు పని మీద టర్కీ వెళ్లారు. ఈ సమయంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇంట్లో వాళ్లకు చెప్పారు. కానీ వారి ప్రేమ వివాహాన్ని అంగీకరించలేదు. వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. చివరికీ ఒప్పుకోవాల్సి వచ్చింది. వారిద్దరికీ 2019లో ఎంగెజ్ మెంట్ చేశారు. తర్వాత ఏడాది పెళ్లి చేయాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ వల్ల పెళ్లి జరగలేదు. కానీ గత ఏడాది మార్చిలో టర్కీలో క్రిస్టియన్ సంప్రాదాయం ప్రకారం చేసుకున్నారు. ఇటీవల గుంటూరు రాగా.. మంగళవారం ఇరువరు హిందూ సంప్రాదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

ప్యారిస్‌కు చెందిన మేరీ
గతనెలలో మరో పెళ్లి జరిగింది. ప్యారిస్‌కు చెందిన మేరీ హెరీ కూడా ఇలా పెళ్లి చేసుకుంది. తన లవర్ రాకేశ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. రాకేశ్ స్వస్థలం బీహర్ బెగుసారాయ్ వారిద్దరూ... ఆరేళ్ల క్రితం ఢిల్లీలో కలిశారు. ఆ సమయంలో ఢిల్లీలో టూరిస్ట్ గైడ్‌గా కుమార్ పనిచేసేవాడు. ఆ సమయంలో అయిన పరిచయం.. మేరీ ప్యారిస్ వెళ్లిన కొనసాగింది. నవంబర్ 21వ తేదీన వారిద్దరూ హిందూ సంప్రాదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

రాజ్యాంగంపై ప్రమాణం
ఒడిశా బెహరామ్పూర్లో మరో వివాహం జరిగింది. బిజయ్ కుమార్, శృతి సక్సెనా ఇద్దరూ భారత రాజ్యాంగంపై ప్రమాణం చేశారు. అక్కడున్న వారు హర్షాతిరేకం వ్యక్తం చేశారు. తమకు విలువైన బహుమతులు ఇచ్చే కన్నా.. రక్తం దానం చేయాలని వధువరూలు కోరారు. రిసెప్షన్ సెంటర్ సమీపంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అంతేకాదు అవయవాలు దానం చేయాలని కూడా కోరారు.