వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Trump Impeachment:అమెరికా చరిత్రలో ఇంపీచ్‌మెంట్ ఎదుర్కొన్న అధ్యక్షులు ఎవరు..?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఇప్పుడు ప్రపంచమంతా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అభిశంసన తీర్మానం గురించే చర్చిస్తోంది. అనతి కాలంలోనే అందరి నోటా ట్రంప్ పేరు నానింది. అయితే ఈ అగ్రరాజ్యపు అధినేతపై పలు విమర్శలు కూడా వచ్చాయి. అదే సమయంలో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రశంసలు వచ్చాయి. కానీ 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున పోటీచేస్తున్న జోబిడెన్‌పై కుట్రపన్నారన్న ఆరోపణలు ట్రంప్‌ను ఇరుకున పెట్టాయి. ఇక ట్రంప్ కంటే ముందు అమెరికా చరిత్రలో ఇద్దరు అధ్యక్షులు అభిశంసన తీర్మానం ఎదుర్కొన్నారు. ఇంతకీ వారెవరు..?

Trump Impeachment:ట్రంప్‌కు అభిశంసన... ఇంపీచ్‌మెంట్ ప్రక్రియ ఏంటి..?Trump Impeachment:ట్రంప్‌కు అభిశంసన... ఇంపీచ్‌మెంట్ ప్రక్రియ ఏంటి..?

 1867లో ఆండ్రూ జాన్సన్ పై తొలిసారిగా అభిశంసన తీర్మానం

1867లో ఆండ్రూ జాన్సన్ పై తొలిసారిగా అభిశంసన తీర్మానం

అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ తొలిసారిగా అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న వారిలో ఆదేశ 17వ అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఉన్నారు. 1865లో ఆయన అభిశంసన తీర్మానం ఎదుర్కొన్నారు. ఇంపీచ్‌మెంట్ ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడిగా ఈయన రికార్డుల్లో నిలిచారు. 1868లో ఆండ్రూ జాన్సన్ అభిశంసన తీర్మానం ఎదుర్కొని ఒక్క ఓటు తేడాతో గట్టెక్కారు. అబ్రహాం లింకన్ హత్యకు గురైన తర్వాత అప్పటి వరకు వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆండ్రూ జాన్సన్ అధ్యక్షుడయ్యారు. తన సెక్రటరీ ఎడ్విన్ స్టాన్టన్‌ను తొలగించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిందని సభ్యులు చెప్పారు. అయితే కాంగ్రెస్ తిరిగి స్టాన్‌టన్‌ను నియమించగా మళ్లీ ఆయన తొలగించి ఎందుకు తొలగించారో అనేదాని పై కాంగ్రెస్‌కు వివరణ ఇచ్చారు. ఇక 1868లో ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు అభిశంసన తీర్మానంను ప్రవేశపెట్టారు. ఇక్కడే ఒక్క ఓటుతో ఆండ్రూ జాన్సన్ గట్టెక్కారు.

1999లో బిల్‌క్లింటన్‌పై అభిశంసన తీర్మానం

1999లో బిల్‌క్లింటన్‌పై అభిశంసన తీర్మానం

ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో ఇద్దరి అధ్యక్షులు అభిశంసన తీర్మానంను ఎదుర్కొన్నారు. మోనికా లెవెన్‌స్కీ స్కాండల్‌లో అమెరికా 42వ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అభిశంసన తీర్మానంను ఎదుర్కొన్నారు. తను మోనికా లెవెన్‌స్కీతో అక్రమ సంబంధం ఉందని రుజువులతో సహా దొరికినప్పటికీ.. న్యాయస్థానం ముందు తనతో ఎలాంటి సంబంధం లేదని అబద్ధం చెప్పాలంటూ బిల్‌క్లింటన్ ఆమెపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అభిశంసన తీర్మానంకు ముందు జరిగే ప్రక్రియలో 228 మందిలో 206 మంది క్లింటన్‌పై విచారణ జరిపాలంటూ కోరారు. 1999లో విచారణ తర్వాత సెనేట్‌లో బిల్ క్లింటన్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా... మూడింట రెండోవంతు మెజార్టీ రాలేదు. దీంతో క్లింటన్ అధ్యక్షుడిగా కొనసాగారు.

ఓటింగ్‌కు ముందే రాజీనామా చేసిన రిచర్డ్ నిక్సన్

ఓటింగ్‌కు ముందే రాజీనామా చేసిన రిచర్డ్ నిక్సన్

రిచర్డ్ నిక్సన్ అమెరికాకు 37వ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1969 నుంచి 1974వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన హయాంలో వాటర్ గేట్ స్కాండల్ వెలుగుచూసింది. డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ కార్యాలయంలో ఏకంగా సోదాలు జరిగాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్ నిక్సన్‌‌కు చెడ్డపేరు వచ్చింది. ఇక పెద్ద ఎత్తున్న ఆయనపై ఆరోపణలు రావడంతో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక విచారణలో భాగంగా టెలిఫోన్ టేపులను ఇవ్వాలని కోరగా ఇచ్చేందుకు రిచర్డ్ నిక్సన్ నిరాకరించారు. 1974 జూలైలో రిచర్డ్ నిక్సన్ అధికార దుర్వినియోగంకు పాల్పడ్డారని, న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఇంపీచ్‌మెంట్‌పై ఓటింగ్ జరగక ముందే నిక్సన్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

ట్రంప్ సులభంగా గట్టెక్కే అవకాశం

ట్రంప్ సులభంగా గట్టెక్కే అవకాశం

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో ఏడాది సమయం మాత్రమే ఉండటంతో అధ్యక్షుడు ట్రంప్‌పై డెమొక్రాట్లు ఇచ్చిన అభిశంసన తీర్మానంపై ప్రతినిధుల సభలో వాడీవేడీ చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ జరిగింది. ఓటింగ్ సందర్భంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా 230 ఓట్లు రాగా అనుకూలంగా 197 ఓట్లు వచ్చాయి. ప్రతినిధుల సభలో మెజార్టీ సభ్యులు డెమొక్రాట్లు ఉన్నందున ట్రంప్ గట్టెక్కలేకపోయారు. సెనేట్‌లో అత్యధికులు రిపబ్లికన్‌లే ఉన్నారు. ఇక ట్రంప్ అధ్యక్షుడిగా దిగిపోవాలంటే రిపబ్లికన్లు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేస్తే తప్ప ఇది జరగదు. ఇది అసాధ్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే మెజార్టీ రిపబ్లికన్ సభ్యులు ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నవారే. ఒకరిద్దరు సెనేటర్లు ఇప్పటికే ట్రంప్ సర్కార్‌పై వ్యతిరేక గళం విప్పారు. ప్రజల్లో ట్రంప్ గ్రాఫ్ పడిపోతున్నప్పటికీ... హౌజ్‌లో మాత్రం ఆయనకు కావాల్సినంత మద్దతు ఉంది. అందుకే ట్రంప్ అభిశంసన తీర్మానంలో సులభంగా గట్టెక్కుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

English summary
With the US House of Representatives formally charging Donald Trump on two counts of wrongdoing, the 73-year-old has become only the third President in the country’s 243-year history to be impeached. The other two in the infamous list were Bill Clinton and Andrew Johnson.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X