• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Cosmic rose: అంతరిక్షంలో గులాబీ..చూడాలంటే 600 హెచ్‌డీ టీవీల స్క్రీన్లు కావాలి

|

వాషింగ్టన్: అంతరిక్షం..అద్భుతాల మయం. అంతులేనిది..అంతే చిక్కనిది. పరిశోధించే కొద్దీ- కొత్త సంగతులు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన ఏ చిన్న వార్తయినా ఆసక్తి రేపుతుంది. ఎక్కడో పాలపుంతలకు అవతల.. సుదూర తీరాల్లో కొత్త గ్రహాలను కనుగొనడం, కృష్ణబిలాలు వెలుగులోకి రావడం, తొక్కచుక్కలు, గ్రహశకలాలు భూమికి చేరువగా ప్రయాణించడం వంటి వార్తలు ఎప్పుడూ ఉత్కంఠతకు గురి చేసేవే. విశ్వాంతరాల్లో జీవజాలాన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలు సాగిస్తోన్న పరిశోధనలు సాగుతున్న కొద్దీ ఆసక్తికర విషయాలు బయటపడుతూనే ఉంటాయి.

అంతరిక్షంలో వికసించిన గులాబీ..


అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా కంటికి ఓ అద్భుత దృశ్యం చిక్కింది. రెండు నక్షత్రపుంజాలు సంయోగం చెందడానికి సంబంధించిన అరుదైన సన్నివేశమది. నాసాకు చెందిన హాబుల్ స్పేస్ టెలిస్కోప్ (Hubble Space Telescope) దాన్ని చిత్రీకరించింది. క్లిక్‌మనిపించింది. భూగోళానికి రెండు మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆండ్రోమెడా పాలపుంత (Andromeda galaxy)లో చోటు చేసుకుంది. ఏఆర్పీ 273 అనే లాక్సీలో మరో ఆండ్రోమెడా పాలపుంత విలీనం అయ్యే క్రమంలో.. అచ్చం గులాబీలాంటి దృశ్యం ఆవిష్కృతమైంది. పదేళ్ల కిందటి చిత్రం అది. దాన్ని నాసా మళ్లీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

అదొక్కటే కాదు..

దీనితో ఆండ్రోమెడా గెలాక్సీకే సంబంధించిన మరో ఫొటోను నాసా విడుదల చేసింది. హాబుల్/యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ టెలిస్కోప్ దీన్ని తీసింది. క్రాప్డ్ వర్షన్ ఫొటో అది. దీని ఫుల్ ఇమేజ్ పిక్సెల్‌ ఎంత ఉంటుందనేది కనీసం మన ఊహకు కూడా అందదు. 1.5 బిలియన్ పిక్సల్‌ రేంజ్. 69536 x 22230 పిక్సెల్స్‌తో ఆండ్రొమెడా గెలాక్సీ ఫొటోను తీసింది. మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే.. ఆ ఫొటోను పూర్తిస్థాయిలో చూడాలీ అంటే..600లకు పైగా హై-డెఫినిషన్ టెలివిజన్ సెట్లకు సంబంధించిన స్క్రీన్లు కావాల్సి ఉంటుంది.

హయ్యెస్ట్ పిక్సెల్ పిక్..

హయ్యెస్ట్ పిక్సెల్ పిక్..

ఇప్పటిదాకా హాబుల్ స్పేస్ టెలిస్కోప్ విడుదల చేసిన అన్ని ఫొటోల కంటే కూడా ఇదే అతి పెద్దది.. అత్యధిక పిక్సెల్ గలది కూడా. ఈ ఒక్క ఫొటోలో 100 మిలియన్లకు పైగా నక్షత్రాలు ఉండొచ్చని నాసా శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు. వేలకొద్దీ స్టార్ క్లస్టర్లు ఉంటాయని భావిస్తున్నారు. 40 వేల కాంతి సంవత్సరాల దూరం నుంచి ఈ ఫొటోను చిత్రీకరించింది హాబుల్ టెలిస్కోప్. ఆండ్రోమెడా.. ఇప్పటిదాకా అంతరిక్ష పరిశోధకులు గుర్తించిన అతి పెద్ద గెలాక్సీల్లో దీన్నీ ఒకటిగా భావిస్తున్నారు.

చంద్రడి కంటే ఆరురెట్లు పెద్దదిగా..

చంద్రడి కంటే ఆరురెట్లు పెద్దదిగా..

ఈ గెలాక్సీ డయామీటర్.. చంద్రుడి వైశాల్యం కంటే ఆరు రెట్లు పెద్దది. ఈ గెలాక్సీలో చోటు చేసుకునే మార్పులను అతి సూక్ష్మస్థాయిలో గుర్తించడానికి ఈ ఫొటో ఉపయోగపడుతుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తోన్నారు. ఇందులో చోటు చేసుకునే కాస్మిక్ మార్పులకు సంబంధించిన మొత్తం 411 ఇమేజీలను హాబుల్/ఈఎస్ఏ టెలిస్కోప్ చిత్రీకరించింది. అల్ట్రా వయెలెట్, నియర్-ఇన్‌ఫ్రారెడ్ వేవ్‌లెంగ్త్స్ విధానంలో హాబుల్ ఈ ఫొటోలన్నింటినీ చిత్రీకరించింది. రెడ్ అండ్ బ్లూ ఫిల్టర్లను వినియోగించింది. జూమ్ టూల్‌లో ఈ ఫొటోను మనం చూడొచ్చు.

English summary
The NASA/ESA Hubble Space Telescope has captured the sharpest and biggest image ever taken of the Andromeda galaxy otherwise known as Messier 31.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X