వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు రావొద్దు: ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన ఏంజెలాకు ట్రంప్ ఫోన్

జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ అమెరికా పర్యటన వాయిదా పడింది. అమెరికా వెళ్లేందుకు మెర్కెల్‌ ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఆఖరి నిమిషంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమెకు ఫోన్‌ చేసి రావొద్దని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ అమెరికా పర్యటన వాయిదా పడింది. అమెరికా వెళ్లేందుకు మెర్కెల్‌ ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఆఖరి నిమిషంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమెకు ఫోన్‌ చేసి రావొద్దని చెప్పారు.

షెడ్యూల్‌ ప్రకారం డొనాల్డ్‌ ట్రంప్‌, మెర్కెల్‌ మంగళవారం సమావేశం కావాల్సి ఉంది. దీంతో వాషింగ్టన్‌ వెళ్లేందుకు మెర్కెల్‌ సోమవారం బెర్లిన్‌లోని ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. మరికాసేపట్లో ఎయిర్ పోర్టుకు చేరుకుంటారనగా ట్రంప్‌ ఆమెకు ఫోన్‌ చేసి అమెరికా రావొద్దని కోరారు.

ఈ విషయాన్ని మెర్కెల్‌ మీడియాకు చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, అందుకే రావొద్దని చెప్పినట్లు ఆమె తెలిపారు.

<strong>యూపీలో బీజేపీ గెలుపు: పాకిస్తాన్‌లో వణుకు.. ఎందుకంటే!</strong>యూపీలో బీజేపీ గెలుపు: పాకిస్తాన్‌లో వణుకు.. ఎందుకంటే!

Angela Merkel to Meet Donald Trump on Friday After Blizzard Delay

అయితే అప్పటికే మెర్కెల్‌ పార్టీకి చెందిన కొందరు నేతలు, మీడియా వ్యక్తులు విమానంలో కూర్చున్నారు. దీంతో ఆమె నేరుగా విమానాశ్రయానికి వెళ్లి జరిగిన విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

వైట్ హౌస్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రస్తుతం అమెరికాలో తుఫాను ఏర్పడిందని, దీని వల్ల కొన్ని విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. మెర్కెల్‌ పర్యటన శుక్రవారం నాటికి వాయిదా వేసినట్లు శ్వేతసౌధం తెలిపింది.

గతంలో కూడా మెర్కెల్‌ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2010లో మెర్కెల్‌ అమెరికా పర్యటనలో ఉండగా ఐస్లాండ్‌లో అగ్నిపర్వతం బద్ధలైంది. భారీ పొగలు వ్యాపించడంతో మెర్కెల్‌ తిరుగు ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. దీంతో పోర్చుగల్‌, ఇటలీ మీదుగా ఆమె జర్మనీ చేరుకోవాల్సి వచ్చింది.

English summary
The first face-to-face meeting between President Donald Trump and German Chancellor Angela Merkel was postponed by a major storm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X