వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందాల నటి కొత్త పాత్ర: రాజకీయాల్లోకి అంజిలినా జోలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

లాస్ ఏంజెలిస్: అమెరికాలో మంగళవారంనాడు మధ్యంతర ఎన్నికలు జరిగిన నేపథ్యంలో తాను రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు అంజిలినా జోలీ చెప్పారు. రాజకీయాల్లో, దౌత్యరంగంలో లేదా ప్రజాసేవలో పనిచేయాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

వివిధ సమస్యలపై ఆమె ఇది వరకే మానవతా దృక్పథంతో కార్యక్రమాలు చేపట్టారు. మానవతా సేవ చేస్తున్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారని వానిటీ ఫెయిర్ కవర్ పేజీ కథనంలో చెప్పారు. "నువ్వు నిజంగానే తీవ్రమై మార్పు కోరుకుంటే నీపై బాధ్యత ఉంటుంది" అని ఆమె అన్నారు.

Angelina Jolie reveals she is open to role in politics

అయితే, నిజానికి చెప్పాలంటే తాను ఏ రంగంలో బాగా ఉపయోగపడుతాననే విషయం తనకు తెలియది, జీవితానికి ఏం కావాలనే విషయం తనకు తెలుసునని ఆమె అన్నారు. రాజకీయాల్లో, ప్రజా సేవలో లేదా దౌత్యరంగంలో పనిచేస్తారా అని అడిగితే వాటిలో దేనికైనా తాను సిద్ధంగానే ఉన్నానని చెప్పారు. అంతకు మించి ఆమె వివరాలు ఇవ్వలేదు.

ఐక్యరాజ్య సమితి శరణార్థురలు ఏజెన్సీ దౌత్యవేత్తగా ఆమె 40 మిషన్లపై 2012 నుంచి ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు. మానవతా దృష్టితో చేసిన కృషిటికి నిరుడు జోలీకి నిరుడు గౌరవ ఆస్కార్ అవార్డు లభించింది. జోలీ దర్శకత్వ రంగంలోకి కూడా కాలు పెట్టారు. 2011లో గోల్డెన్ గ్లోబ్ నామినేటెడ్ "ఇన్ ద ల్యాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హానీ"కి దర్శకత్వం వహించారు.

1990 దశకం ప్రారంభంలో జరిగిన బోస్నియా సమరం నేపథ్యంగా ఈ చిత్రాన్ని తీశారు. ఆ తర్వాత వచ్చే సినిమా "అన్‌బ్రోకెన్" ఓలింపియన్, రెండో ప్రపంచ యుద్ధం పివోడబ్ల్యులో బతికి బయటపడిన లూయిస్ జంపెరినిపై తీశారు. ఈ సినిమా అమెరికాలో డిసెంబర్ 25వ తేదీన విడుదల కానుంది. "స్వీపింగ్ ఎపిక్" అనే సినిమాకు ఆమె తదుపరి దర్శకత్వం వహించనున్నారు.

English summary
As Americans went to the polls for midterm elections on Tuesday, Angelina Jolie revealed that she is open to a possible role in politics, diplomacy or public service.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X