వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవేం మాటలు? ట్రంప్‌పై హాలీవుడ్ నటి ఏంజెలీనా ఫైర్

|
Google Oneindia TeluguNews

లండన్: అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముస్లింలకు వ్యతిరేకంగా ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను జోలీ తప్పుపడుతూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

శరణార్థులకు ఐక్యరాజ్య సమితి దూతగా ఉన్న జోలీ.. బీబీసీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో శరణార్థులతో మాట్లాడారు. అమెరికాలోకి ముస్లింలను అనుమతించరాదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించమని ఓ వ్యక్తి కోరగా.. జోలీ కళ్లు మూసుకుని, నిరసనగా తల అడ్డంగా ఊపారు.

Angelina Jolie slams Trump for anti-Muslim comments

ఆ తర్వాత, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు వినాల్సిరావడం చాలా కష్టంగా ఉందని పేర్కొన్నారు. 'ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వలసదారులందరితో కలిసి అమెరికా నిర్మితమైంది. మతం, ప్రాంతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించేందుకు అమెరికా వచ్చారు. ట్రంప్ అభిప్రాయం అమెరికాపై నాకున్న విజన్‌కు విరుద్ధమైంది' అని జోలీ తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ట్రంప్ ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ.. వారిని అమెరికాలోకి రాకుండా నిషేధించాలని అన్నారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడిన అభ్యర్థులపైనా, పలు విదేశాలపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇటీవల మాట్లాడుతూ.. ముస్లింలపై తాను చేసిన వ్యాఖ్యలు సూచనలేనని వ్యాఖ్యానించారు.

English summary
Angelina Jolie lashed out at U.S. presidential candidate Donald Trump on Monday for his controversial remarks against Muslims, comments that have prompted waves of anger in Islamic communities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X