• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మరోసారి క్రూరత్వం చాటుకున్న కిమ్... నిర్దాక్షిణ్యంగా ఆ దంపతుల ఉరితీత.. ఉలిక్కిపడ్డ ఉత్తర కొరియా..

|

ఆధునిక నియంతల్లో తనను మించినవారు లేరని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇప్పటికీ ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. ఆ దేశానికి సంబంధించి ఏ వార్త బయటకొచ్చినా.. అది కిమ్ నియంత్రుత్వానికో,క్రూరత్వానికో ముడిపడి ఉంటుంది. తాజాగా ఉత్తర కొరియాకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగుచూసింది. ఇటీవల దేశం దాటి పారిపోయేందుకు యత్నించిన ఓ జంటను సైన్యం ఉరితీసింది. ఇంతకీ ఆ జంటను ఎందుకు పారిపోవాలనుకున్నారు.. అసలేం జరిగింది..

  A Couple Executed By Firing Squad In North Korea
  ఇదీ జరిగింది...

  ఇదీ జరిగింది...

  ఉత్తర కొరియాలోని ర్యాంగాంగ్ ప్రావిన్స్‌కు చెందిన 50ఏళ్ల భార్యాభర్తలు ఇద్దరు ఇటీవల రహస్యంగా దేశ సరిహద్దును దాటి చైనాలోకి పారిపోవాలనుకున్నారు. తమతో పాటు మేనల్లుడు(14)ని కూడా వెంట తీసుకెళ్లారు. చైనా బోర్డర్‌లోకి ప్రవేశించాక.. అక్కడి నుంచి సౌత్ కొరియా వెళ్లి.. అక్కడ నివాసం ఉంటున్న తన సోదరుడి కుటుంబాన్ని కలుసుకోవాలని ఆమె భావించింది. తద్వారా తన మేనల్లుడిని తిరిగి అతని కుటుంబంతో కలపాలని చూసింది. ఆమె సోదరుడు కూడా కొంత కాలం క్రితమే ఉత్తర కొరియా నుంచి పారిపోయి దక్షిణ కొరియాలో స్థిరపడ్డాడు. అయితే అతని కొడుకు మాత్రం ఇక్కడే ఉండిపోవడంతో అప్పటినుంచి అతని బాగోగులు వారే చూస్తున్నారు. ఇటీవల కరోనా వైరస్ కారణంగా వ్యాపారంలో నష్టాలు కూడా రావడంతో దేశం విడిచి వెళ్లిపోవాలనుకున్నారు.

  దంపతుల ఉరితీత...

  దంపతుల ఉరితీత...

  అనుకున్నట్టుగానే మేనల్లుడిని వెంట పెట్టుకుని రహస్యంగా ర్యాంగాంగ్‌లోని చైనా సరిహద్దు వద్దకు ఆ దంపతులు చేరుకున్నారు. అక్కడి నుంచి యాలు నదిని దాటి చైనాలోకి ప్రవేశించాలనుకున్నారు. కానీ ఇంతలోనే బోర్డర్ సెక్యూరిటీ వారిని పట్టుకున్నారు. అనంతరం వారిని చిత్ర హింసలకు గురిచేయడంతో నిజం ఒప్పుకున్నారు. తల్లిదండ్రుల నుంచి వేరైన తమ మేనల్లుడిని తిరిగి వారి చెంతకు చేర్చేందుకే వెళ్తున్నామని,అంతే తప్ప మరో ఉద్దేశం లేదని వారు చెప్పారు. అయినప్పటికీ సైన్యం వారిని కనికరించలేదు. ఫైరింగ్ స్క్వాడ్ వారిని ఉరితీసింది. బాలుడు మైనర్ అన్న కారణంగా అతన్ని మాత్రం ఉరితీయకుండా లేబర్ క్యాంపుకు తరలించారు.

  ఉలిక్కిపడ్డ ఉత్తర కొరియా ప్రజలు..

  ఉలిక్కిపడ్డ ఉత్తర కొరియా ప్రజలు..

  నిజానికి నేరమేదైనా ముందుగా నిందితులను లేబర్ క్యాంపుకు తరలించడం ఉత్తరకొరియాలో సాధారణం. ఆ తర్వాతే శిక్షలను నిర్దారిస్తారు. కానీ అందుకు విరుద్దంగా ఈ జంటను ఉరితీయడం ఉత్తర కొరియా జనాలను ఉలిక్కి పడేలా చేసింది. ప్రస్తుతం ఉత్తర కొరియాలో కరోనా వైరస్ కారణంగా కిమ్ జోంగ్ ఉన్ ఎమర్జెన్సీ విధించారు. ఇదే అదనుగా భావించి ఎవరైనా పారిపోయేందుకు ప్రయత్నిస్తే.. కఠిన చర్యలు తీసుకోవాలని సైన్యాన్ని ఆదేశించారు. ఉత్తర కొరియాలో ఇలా దేశం దాటి పారిపోయేందుకు యత్నించి సైన్యం చేతిలో హతమైన వాళ్లు కోకొల్లలు. రహస్యంగా దేశం దాటించేందుకు కొంతమంది బ్రోకర్స్ కూడా పనిచేస్తుంటారు. అందుకోసం వారికి భారీ స్థాయిలో డబ్బు ముట్టజెప్పాల్సి ఉంటుంది.

  English summary
  The husband and wife were apprehended attempting to flee across the border with China in the Ryanggang province of the country. They were accompanied by their nephew who escaped execution as he was a minor. Their desire was to pass secretly through China and then get to South Korea to be reunited with family members there.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more