వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పగబట్టిన ప్రకృతి?: అమెరికాకు మరో గండం.. ఆ హెచ్చరికలతో బెంబేలెత్తుతున్న జనం

ఇర్మా తర్వాత జోష్ హరీకేన్ అమెరికాపై విరుచుకుపడనుందని వాతావరణ నిపుణులు తెలిపారు.

|
Google Oneindia TeluguNews

హోస్టన్: హర్రీకేన్ హార్వే స్రుష్టించిన భీభత్సం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే ఇర్మా తుఫాను అమెరికాను గడగడాలడిస్తోంది. ఇదిలా విరుచుకుపడుతుండగానే.. ఇప్పుడు మరో ముప్పు కూడా అమెరికాపై విరుచుకుపడటానికి సిద్దమైంది.

ఇర్మా తర్వాత జోష్ హరీకేన్ అమెరికాపై విరుచుకుపడనుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ప్రకృతి పగబట్టిందా? అన్న రీతిలో వరుస తుఫానులు అమెరికా మీద విరుచుకుపడుతుండటం అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. హరీకేన్ హర్వీ భీభత్సానికి దాదాపు 70మంది ప్రాణాలు కోల్పోగా.. కోట్లలో నష్టం వాటిల్లింది.

Another Major Storm Is Brewing Over The Atlantic

అలాగే 250 కి.మీ వేగంతో దూసుకొచ్చిన ఇర్మా హరికేన్ టెక్సాస్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే భారీ నష్టం కలిగించడం తెలిసిందే. ఇర్మా ధాటికి ఇళ్లు గాల్లో తేలిపోతున్నాయంటే.. తుఫాను తాకిడి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టెక్సాస్, హోస్టన్ నగరాల ప్రజలు ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

ఇలాంటి తరుణంలో జోష్ హరీకేన్ విరుచుకుపడనుందని వార్తలు రావడంతో వారిలో మరింత భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరీబియన్ దీవుల దిశగా జోష్ హరికేన్ వేగంగా దూసుకొస్తోందని, హార్వే హరికేన్ ముగియగానే అమెరికాను జోష్ తాకుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

English summary
As east Texas and Louisiana recover from the devastation of Hurricane Harvey, both south Florida and Puerto Rico have been preparing for the potential arrival of Hurricane Irma this week
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X