వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగ్ షాక్ : బ్రిటన్‌లో కరోనా మూడో వేరియంట్.. రెండో దాని కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి...

|
Google Oneindia TeluguNews

కొత్త కోవిడ్ 19 స్ట్రెయిన్ వెలుగుచూడటం... అది 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆస్పత్రులన్నీ నిండిపోయి అతాలకుతలమవుతున్న బ్రిటన్‌పై మరో పిడుగు పడింది. తాజాగా కరోనా వైరస్ మూడో వేరియంట్(మూడో రకం)ను గుర్తించినట్లు బ్రిటన్ హెల్త్ సెక్రటరీ మాట్ హన్‌కాక్ బుధవారం(డిసెంబర్ 23) వెల్లడించారు. సౌతాఫ్రికా నుంచి బ్రిటన్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో ఈ కొత్త రకాన్ని నిర్దారించినట్లు చెప్పారు. గత రెండు వారాల్లో సౌతాఫ్రికా నుంచి బ్రిటన్ వచ్చినవారంతా తక్షణం ఐసోలేషన్‌లోకి వెళ్లాలని సూచించారు.

మూడో వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందితే...

మూడో వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందితే...

కొత్తగా బయటపడ్డ మూడో వేరియంట్ కూడా వేగంగా వ్యాప్తి చెందితే పరిస్థితులు అత్యంత సంక్లిష్టంగా మారుతాయని హెల్త్ సెక్రటరీ మాట్ హన్‌కాక్ పేర్కొన్నారు. మూడో వేరియంట్ బయటపడ్డ వ్యక్తులతో కలిసినవారు కూడా క్వారెంటైన్‌ పాటించాలని సూచించారు. తక్షణమే సౌతాఫ్రికాకు విమాన రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ మూడో వేరియంట్‌పై ప్రస్తుతం పరిశోధనలు జరుపుతున్నామని... వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలుగుతామని విశ్వసిస్తున్నట్లు ఇంగ్లాండ్‌కి చెందిన డా.సుసన్ హోప్‌ కిన్స్ తెలిపారు.

 నిండిపోతున్న ఆస్పత్రులు...

నిండిపోతున్న ఆస్పత్రులు...

గడిచిన వారం రోజుల్లో సౌతాఫ్రికాలో కరోనా పాజిటివ్ కేసులు 57శాతం పెరిగాయి. ఒక్కరోజు వ్యవధిలోనే దాదాపు 1099 మంది ఆస్పత్రుల్లో చేరారు. డిసెంబర్ 22 నుంచి ఇప్పటివరకూ బ్రిటన్‌లో మొత్తం 691 మరణాలు సంభవించాయి. వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే హెల్త్ కేర్ వ్యవస్థ చేతులెత్తేసే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కరోనా రెండో రకం (సెకండ్ వేరియంట్) వెలుగులోకి వచ్చిన తర్వాత సౌత్ ఈస్ట్ బ్రిటన్‌లో టైర్ 4 ఆంక్షలను అమలుచేస్తున్నారు.

 రెండో వేరియంట్ కంటే వేగంగా

రెండో వేరియంట్ కంటే వేగంగా

ఓవైపు కరోనా సెకండ్ వేరియంట్ జన్యువును విశ్లేషించే ప్రయత్నాలు జరుగుతుండగానే కరోనా మూడో వేరియంట్ కూడా వెలుగుచూడటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే వైరస్‌లు ఇలా వేగంగా రూపాంతరం చెందడం సాధారణమేనని నిపుణులు చెప్తున్నారు. కానీ వీటి వ్యాప్తి వేగంగా పెరిగితే మాత్రం హెల్త్ కేర్ వ్యవస్థపై ఒత్తిడి తీవ్రమై విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉందంటున్నారు. సౌతాఫ్రికాలో పుట్టుకొచ్చిన కొత్త కరోనా వేరియంట్‌ను 501.V2గా పరిగణిస్తున్నారు. బ్రిటన్‌లో వెలుగుచూసిన సెకండ్ వేరియంట్ కంటే ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి రిపోర్టులు చెప్తున్నాయి.

సౌతాఫ్రికాకు విమాన రాకపోకలు నిషేధం....

సౌతాఫ్రికాకు విమాన రాకపోకలు నిషేధం....

సౌతాఫ్రికా నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం కరోనా కొత్త వేరియంట్ బయటపడ్డ తర్వాత కేవలం ఒక్కరోజులోనే 9500 పాజిటివ్ కేసులు నమోదైనట్లు చెప్తున్నారు. ఇందులో 90శాతం మందిలో కొత్త వేరియంట్ స్ట్రెయిన్‌ను గుర్తించినట్లు చెప్తున్నారు. సౌతాఫ్రికాలో నెలకొన్న పరిస్థితులతో బ్రిటన్,జర్మనీ,స్విట్జర్లాండ్,టర్కీ,ఇజ్రాయెల్,మారిషస్ ఆ దేశానికి విమాన రాకపోకలను తాత్కాలికంగా నిషేధించాయి.

English summary
Another new strain of Covid-19 has been detected in the UK, which has originated from South Africa, health secretary Matt Hancock announced on 23 December.All travellers from South Africa in the past two weeks must isolate immediately because of the new strain, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X