వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాద వార్త: థాయ్ చిన్నారులను కాపాడాడు...అదేసమయంలో తండ్రిని కోల్పోయాడు

|
Google Oneindia TeluguNews

రెండువారాలుగా ప్రమాదకరమైన థాయ్‌లాండ్ గుహల్లో చిక్కుకుపోయిన చిన్నారులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘట్టం వెనక ఎందరో క‌ృషి, కష్టం దాగి ఉంది. చిన్నారులు సురక్షితంగా బయటపడినందుకు అటు వారి కుటుంబ సభ్యులు ఇటు ప్రంపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఊపిరి తీసుకున్నారు. అయితే చిన్నారులను కాపాడే క్రమంలో అధికారులు చేసిన త్యాగం అంతా ఇంతా కాదు. వారు చేసిన కృషి ఈ ఘటన గుర్తున్నంత కాలం ఉంటుంది.

థాయ్‌లాండ్ గుహల్లో సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో ఓ డైవర్ మృతి చెందిన సంఘటన మరవకముందే మరో బాధాకరమైన వార్త వెలుగు చూసింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొని కీలకంగా వ్యవహరించారు ఆస్ట్రేలియా డాక్టర్ రిచర్డ్ హ్యారీ. అనెస్తీషియన్ అయిన డాక్టర్ హ్యారీకి కేవ్ డైవింగ్‌లో 30 ఏళ్ల అనుభవం కూడా ఉంది. చిన్నారులను కాపాడేందుకు చల్లటి నీటిలో 4 కిలోమీటర్లు ఈదుకుంటూ వెళ్లాడు. చిన్నారులతో పాటు కోచ్‌ను కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చాక చివరిగా డాక్టర్ హ్యారీ గుహలోనుంచి బయటకు వచ్చాడు.

Another sad news in Thai caves episode

వచ్చీ రాగానే ఆయన చేదు వార్త విని గుండెలవిసేలా ఏడ్చారు. ఆయన 13 మంది చిన్నారులను రక్షించేందుకు లోపలికి వెళ్లిన సమయంలో ఆస్ట్రేలియాలో చికిత్స పొందుతున్న తన తండ్రి మరణవార్తను విని హ్యారీ తట్టుకోలేకపోయాడు. డాక్టర్ హ్యారీ పుట్టెడు దుఃఖంలోకి వెళ్లిపోయారు. ఆయన్ను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

Another sad news in Thai caves episode

డాక్టర్ హ్యారీ ఒక గొప్ప మిషన్ పై వెళ్లిన సమయంలో ఈ చేదువార్త చెప్పాల్సి వస్తుందని అనుకోలేదని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. చిన్నారులు గుహల్లో చిక్కుకున్నారన్న విషయం తెలుసుకోగానే హ్యారీ మనస్సు ఆగలేదని... తను వెళ్లి తన వంతు సహాయం చేసి పిల్లలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని హాస్పిటల్ సిబ్బందితో చెప్పడం వారు గుర్తు చేసుకున్నారు. తండ్రి మరణ పడకపై ఉన్నప్పటికీ చిన్నారుల భవిష్యత్తు గురించి డాక్టర్ హ్యారీ ఆలోచించి వెంటనే ఆడిలైడ్ నుంచి థాయ్‌లాండ్‌కు వెళ్లాడని హాస్పిటల్ సిబ్బంది గుర్తుచేసుకున్నారు. డాక్టర్ హ్యారీ చాలా గొప్పమనిషి అని వారు కొనియాడారు.

English summary
Now that the kids have finally been rescued from the Thai Cave, we can all anticipate the kind of relief their families and the authorities must be feeling. We recently learnt that 37-year-old Sergeant Saman Guana, a former Navy Seal died overnight during the effort to rescue the 12 boys and their coach.Not only him,an Australian doctor who was very critical to the Thai rescue mission also received the news of his father's sudden demise after he came out of the flooded tunnels.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X