వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగని విషాదం: బీచ్‌కు కొట్టుకొచ్చిన మరో చిన్నారి

|
Google Oneindia TeluguNews

జోహన్నెస్‌బర్గ్: ఇటీవల టర్కీ బీచ్‌కు కొట్టుకువచ్చిన సిరియా బాలుడు అయిలాన్‌ కుర్దీ మృతదేహం ప్రపంచాన్ని కదిలించింది. ఈ విషాద ఘటన మరువకముంగే మరో ఘటన చోటు చేసుకుంది. ఓ వలస పడవ సముద్రంలో మునిగిపోవడంతో చనిపోయిన నాలుగేళ్ల చిన్నారి మృత దేహం పశ్చిమ టర్కీలోని ఓ బీచ్‌కి కొట్టుకొచ్చింది.

ఐజ్మిర్‌ రాష్ట్రంలోని ఏజియాన్‌ పట్టణం సముద్రతీరానికి నాలుగేళ్ల బాలిక మృత దేహం కొట్టుకొచ్చిందని స్థానిక మీడియా వెల్లడించింది. అక్కడి మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. 15మందితో వెళుతున్న వలస పడవ అక్కడి చిసో శాంక్‌ అనే గ్రీకు ద్వీపం సమీపంలో మునిగిపోయింది.

Another syrian child's body washes up on beach

ఎనిమిది మంది పిల్లలు సహా 14 మంది సిరియన్లను కోస్ట్‌ గార్డ్‌ దళాలు రక్షించాయి. ఈ నాలుగేళ్ల బాలిక మృతదేహం మాత్రం టర్కీ తీరానికి కొట్టుకువచ్చింది. సిరియాలో నెలకొన్న సంక్షోభంతో శరణార్థుల పరిస్థితి దయనీయంగా మారింది.

కాగా, ఇటీవల మూడేళ్ల బాలుడు అయిలాన్‌ కుర్దీ మృత దేహం చిత్రం ప్రపంచం మొత్తాన్ని కన్నీరు పెట్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సిరియా శరణార్థులను తమ దేశాల్లోకి అనుమతించేందుకు పలు దేశాధినేతలు కూడా ముందుకు వచ్చారు.

English summary
It’s being reported that a four-year-old Syrian girl's body has washed up on a beach in western Turkey this afternoon just weeks after images of drowned Syrian toddler Aylan Kurdi shook the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X