వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్-కిమ్ మరోసారి భేటీ కాబోతున్నారా... ఆసక్తికర పరిణామాలు... ఏం జరగబోతోంది..

|
Google Oneindia TeluguNews

నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి భేటీ కావాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ కోరినట్లు సియోల్ అధికారి ఒకరు వెల్లడించారు. 'ట్రంప్-కిమ్‌ల మధ్య మరో సమావేశం మరుగునపడ్డ అణు చర్చలకు ఆస్కారం కల్పిస్తుంది. అణు కార్యకలాపాలు,ఉత్తర కొరియాపై ఆంక్షలు చర్చల ద్వారా పరిష్కారమవుతాయి.' అని మూన్ జే ఇన్ పేర్కొన్నట్లుగా చెప్పారు. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్‌తో రిమోట్ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మూన్ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిపారు.

అమెరికా ఏమంటోంది...

అమెరికా ఏమంటోంది...

దక్షిణ కొరియా చేసిన ఈ ప్రతిపాదనపై అమెరికా నుంచి ఇప్పటివరకూ ప్రత్యక్ష స్పందనేదీ రాలేదు. అయితే ఉత్తర కొరియాతో చర్చలకు అమెరికా తరుపున ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఆ దేశ విదేశాంగ డిప్యూటీ సెక్రటరీ స్టీఫెన్ బైగన్ ఇటీవల మాట్లాడుతూ... ఒకవేళ అమెరికా-ఉత్తర కొరియా మధ్య చర్చలు పునరుద్దరించబడినా... అవి ఓ కొలిక్కి రావడానికి,పురోగతి సాధించడానికి ఇంకా చాలా సమయం పడుతుందన్నారు. కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో అసలు చర్చలు జరిగేందుకు అవకాశం లేదన్నారు.

మళ్లీ రాజుకున్న వివాదం...

మళ్లీ రాజుకున్న వివాదం...

రెండు కొరియా దేశాల మధ్య కమ్యూనికేషన్ కోసం సరిహద్దులో ఏర్పాటు చేసిన ఓ దౌత్య కార్యాలయాన్ని ఉత్తర కొరియా గత నెలలో పేల్చేసిన నాటి నుంచి అమెరికాతో మళ్లీ వివాదం రాజుకుంటోంది. కిమ్ జోంగ్ ఉన్‌పై సరిహద్దు వద్ద దక్షిణ కొరియా కరపత్రాలతో దుష్ప్రచారం నిర్వహిస్తున్నందునే ఆ కార్యాలయాన్ని పేల్చేసినట్టు ఉత్తర కొరియా పేర్కొంది. అయితే అమెరికా ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పటినుంచి ఉత్తర కొరియా అమెరికా పట్ల దూకుడుగా స్పందిస్తోంది.

అమెరికాపై నార్త్ కొరియా ఫైర్...

అమెరికాపై నార్త్ కొరియా ఫైర్...

ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖలోని యూఎస్ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ క్వాన్ జోంగ్ గన్ గత నెలలో అమెరికాపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 'అమెరికా ఒక భయానక అనుభవాన్ని చవిచూడకుండా ఉండాలంటే... ముందు తన నాలుకను అదుపులో పెట్టుకుని తమ అంతర్గత వ్యవహారాలేవో చూసుకోవాలి. ఇది అమెరికా ప్రయోజనాలకే కాదు,రాబోయే అధ్యక్ష ఎన్నికలు సాఫీగా జరిగేందుకు ఉపయోగపడుతుంది.' అని హెచ్చరించారు.

Recommended Video

Trump 'More And More Angry On China' Over Coronavirus || Oneindia Telugu
గత చర్చల్లో పురోగతి లేదు...

గత చర్చల్లో పురోగతి లేదు...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 2018లో సింగపూర్‌లో, తర్వాత 2019లో వియత్నాంలో ఇద్దరూ భేటీ అయ్యారు. కానీ ఆ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అంతకుముందు అణ్వాయుధ కార్యకలాపాలను నిలిపివేయాలంటూ ఐరాస,అమెరికా ఉత్తర కొరియాపై పలు ఆంక్షలు విధించాయి. అమెరికా అణు నిరాయుధీకరణను డిమాండ్ చేస్తోంది. అందుకు ఒప్పుకోవాలంటే తమను అణ్వాయుధ దేశంగా గుర్తించాలని ఉత్తర కొరియా కోరుతోంది. ఈ రెండు అంశాలపై ట్రంప్,కింగ్ మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల అధ్యక్షుల మధ్య మరో భేటీ అవసరమని దక్షిణ కొరియా సూచిస్తోంది.

English summary
South Korean President Moon Jae-in has called on President Trump and North Korean leader Kim Jong Un to meet again before the U.S. presidential election in November, a Seoul official said Wednesday, according to Reuters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X