వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఏఏ వ్యతిరేక తీర్మానాలు అనధికారం, ఆరు పార్టీల ప్రాధాన్య అంశాలే: ఈయూ అధికార ప్రతినిధి హెన్రిక్సన్

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టంపై యూరొపియన్ యూనియన్ పార్లమెంట్ ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టడంపై సర్వత్రా చర్చానీయాంశమైంది. తీర్మానాలను ప్రవేశపెట్టడాన్ని భారత్ ఖండించారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా ఈయూ అధ్యక్షుడికి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో యూరొపియన్ పార్లమెంట్ అధికార ప్రతినిధి ఒకరు హాట్ కామెంట్స్ చేశారు. ఆ తీర్మానాలు అధికార వైఖరి మాత్రం కాదని చెప్పి.. భారత్‌కు స్వాంతన చేకూర్చారు.

 ఆరు తీర్మానాలు

ఆరు తీర్మానాలు

సీఏఏకు వ్యతిరేకంగా ఆరు రాజకీయ పార్టీలు నిన్న ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వాటిపై వచ్చే వారం చర్చ జరగనుందనే ఊహాగానాల నేపథ్యంలో ఈయూ విదేశీ వ్యవహారాల, భద్రత అధికార ప్రతినిధి వర్జిని బట్టు హెన్రిక్సన్ స్పందించారు. ఇదీ కేవలం కొన్ని రాజకీయ పార్టీలు ప్రవేశపెట్టిన తీర్మానమేనని ‘ఇండియా టుడే' ప్రతినిధికి స్పష్టంచేశారు. ప్రభుత్వ చర్య మాత్రం కాదని తేల్చిచెప్పారు. యూరొపియన్ పార్లమెంట్‌లో 28 రాజకీయ, ఆర్థిక సంస్థలకు చెందిన ప్రతినిధులు ఉన్నారని స్పష్టంచేశారు.

మోడీ, స్పీకర్..

మోడీ, స్పీకర్..

సీఏఏకు వ్యతిరేకంగా ఆరు పార్టీలకు చెందిన 600 మంది సభ్యులు తీర్మానం ప్రవేశఫెట్టడం చర్చకు దారితీసింది. దీనిపై ప్రధాని మోడీ, స్పీకర్ కూడా ధీటుగానే స్పందించారు. భారతదేశ అంతర్గత విషయాల్లో విదేశాలు కల్పించుకోవడం సరికాదని తిప్పకొట్టాయి. ఈ క్రమంలో ఈయూ అధికార ప్రతినిధి కామెంట్లు కాస్త ఊరట కలిగించాయి. యూరొపియన్ పార్లమెంట్‌లో రోజువారీ వ్యవహారాల్లో భాగంగా.. డ్రాప్ట్ రిజొల్యూషన్స్ ప్రవేశపెడుతుంటారని పేర్కొన్నారు. ఇదీ కేవలం ఆయా రాజకీయ పార్టీలు ప్రాధాన్య అంశాలను తీసుకొని రూపొందించినవేనని తేల్చిచెప్పారు. ఆయా తీర్మానాల్లో సభ్యులు అభిప్రాయాలు ఈయూ అధికార స్థానానికి మాత్రం ప్రాతినిధ్యం వహించవని తేల్చిచెప్పారు.

ఇవే ఆ పార్టీలు..

ఇవే ఆ పార్టీలు..

ద రెన్యూ గ్రూపు 108 మంది సభ్యులు, యూరొపియన్ కన్జర్వేటివ్ అండ్ రిఫార్మిసిస్ట్స్ గ్రూపు 66, యూరొపియన్ యునైటెడ్ లెఫ్ట్/ నార్డిక్ గ్రీన్ లెఫ్ట్ (జీయూఈ/ఎన్జీఎల్) 41 మంది, యూరొపియన్ పీపుల్స్ పర్టీ 182 మంది, ప్రొగ్రెసివ్ అలయెన్స్ ఆఫ్ సొషలిస్ట్ అండ్ డెమోక్రటిక్ (ఎస్అండ్‌డీ) గ్రూపు 154 మంది, గ్రీన్స్ యూరొపియన్ ప్రీలాన్స్అలయిన్స్ 75 మంది సభ్యులతో కలిసి మొత్తం 626 మంది సభ్యులు సీఏఏకు వ్యతిరేకంగా ఆరు తీర్మానాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటిపై వచ్చేవారం చర్చ జరిగే అవకాశం ఉంది.

English summary
European Union has distanced itself from the six resolutions against caa that have been submitted in the European Parliament by lawmakers from six political groups.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X