వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా బారిన పడి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గుతోందట: పరిశోధకులు

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తోంది. ఈ క్రమంలోనే ఈ మహమ్మారిపై పోరుకు ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగానే వ్యాక్సిన్‌ను కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కరోనావైరస్ సోకిన వ్యక్తిలో యాంటీబాడీస్ డెవలప్ అయితే ఆ వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంతా భావిస్తున్న నేపథ్యంలో ఇటీవలే జరిగిన ఓ స్టడీ ఇందుకు భిన్నంగా చెబుతోంది. కరోనావైరస్ యాంటీ బాడీస్ ప్రతి ఒక్కరిలో రోగనిరోధక శక్తి పెంచుతుందన్న గ్యారెంటీ లేదని ఆ స్టడీ స్పష్టం చేసింది.

రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పలేం

రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పలేం

ఒక వ్యక్తికి కరోనావైరస్ వచ్చి ఆపై చికిత్స తీసుకుని కోలుకున్న తర్వాత అతని రోగనిరోధక శక్తి పెరుగుతుందని గ్యారెంటీగా చెప్పలేమని పరిశోధనలో తేలింది. అప్పటికప్పుడు యాంటీబాడీస్‌వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందేమో కానీ... కాలక్రమంలో ఇమ్యూనిటీ పవర్ క్రమంగా తగ్గిపోతుందని స్టడీ వెల్లడించింది. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన పరిశోధకులు 3,65,000 మందిని ఈ ఏడాది జూన్ 20 నుంచి సెప్టెంబర్ 28 వరకు పరీక్షించారు. తొలిసారి పరీక్షలు నిర్వహించిన తర్వాత మూడు నెలలకు వారిలో యాంటీ బాడీస్ 26శాతం మేరా పడిపోయినట్లు అబ్జర్వ్ చేసినట్లు తెలిపారు. యాంటీబాడీస్ పడిపోయిన వారిలో ఎక్కువగా 65 ఏళ్లు అంతకు మించి ఎక్కువ వయసున్నవారే ఉన్నారని వెల్లడించింది.

 యాంటీబాడీస్ సంఖ్య తగ్గుతోంది

యాంటీబాడీస్ సంఖ్య తగ్గుతోంది

కరోనాబారిన పడ్డ చాలామందిలో యాంటీబాడీస్ క్రమంగా తగ్గుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందని అదే సమయంలో ఏ స్థాయిలో ఈ యాంటీబాడీస్ రోగనిరోధక శక్తిని పెంచుతాయో లేదా రోగనిరోధక శక్తి మనిషిలో ఎంతకాలం ఉంటుందో అనేదానిపై స్పష్టత రాలేదని ప్రొఫెసర్ పాల్ ఇలియట్ చెప్పారు. శరీరానికి యాంటీబాడీస్ రక్షణ కవచంలా ఉంటాయని, టీ కణాలు మాత్రం రోగనిరోధక శక్తిని ఇస్తాయని వెల్లడించారు. ఇక్కడే యాంటీబాడీస్ మరియు రోగనిరోధక శక్తిల మధ్య సంబంధం ఏంటనేదానిపై స్పష్టత లేకుండా ఉంది.

 కరోనావైరస్ తిరిగి ఒకే వ్యక్తికి మరో సారి వస్తుందా..?

కరోనావైరస్ తిరిగి ఒకే వ్యక్తికి మరో సారి వస్తుందా..?

ఒకసారి కరోనావైరస్ బారిన పడ్డ వ్యక్తికి మరో సారి కరోనావైరస్ రాదని గ్యారెంటీగా చెప్పలేమంటున్నారు పరిశోధకులు. కరోనావైరస్ బారిన పడి తర్వాత కోలుకున్న వారిలో నాలుగు వారాల సమయంలోనే యాంటీబాడీస్ సంఖ్య పడిపోతోందని పరిశోధకులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి లేకపోతే వైరస్ మరోసారి అటాక్ అయ్యే అవకాశం ఎందుకు ఉండకూడదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇతర సాధారణ వైరస్‌లు ఎలాగైతే వచ్చి పోయి మళ్లీ తిరగబెడతాయో... కరోనావైరస్ కూడా అంతే అని అయితే రీఇన్‌ఫెక్షన్‌కు ఛాన్సెస్ ఉన్నాయని చాలా తక్కువ డాక్యుమెంట్లు మాత్రమే చెప్పుకొచ్చాయని ప్రొఫెసర్ హెలెన్ వార్డ్ తెలిపారు. ఇక ఆసియా దేశాల్లో ఉన్నయువతలో యాంటీబాడీస్ ఎక్కువగా డెవలప్ అయినపట్లు పరిశోధకులు చెప్పారు. కరోనా బారిన పడ్డ వారితో దగ్గరగా ఉన్నందునే వీరిలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయని చెప్పారు.

English summary
Researchers say that antibodies in covid affected people may not build immunity over a time period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X