వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిషెల్లీపై దారుణ జాత్యహంకారం: 'హై హీల్స్ కోతి' అంటూ దూషణ

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : ట్రంప్ విజయం తర్వాత అమెరికా ప్రథమ మహిళ మిషెల్‌ ఒబామాపై 'క్లే కౌంటీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌' అనే స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ పమేలా రామ్సే టేలర్‌ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.

అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం తన ఫేస్ బుక్ ద్వారా స్పందించిన టేలర్.. 'ఇకనుంచి అందంగా, సాంప్రదాయబద్దంగా ఉండే ప్రథమ మహిళగా మెలానియా ట్రంప్ రాబోతున్నారు. ఇన్నాళ్లు హైహీల్స్ వేసుకున్న కోతిలా ఉండే మిషెల్(ఏప్ ఇన్ హీల్స్) ను చూసి విసుగొచ్చింది' అంటూ కామెంట్స్ చేశారు.

ఫేస్‌బుక్ లో పమేలా రామ్సే టేలర్ జాత్యహంకార వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తింది, పలువురు నెటిజెన్స్ టేలర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సరైన వ్యాఖ్యలు చేశావంటూ టేలర్ కు వంతపాడినవారు కూడా లేకపోలేదు. చార్ల్స్‌టన్‌ టౌన్ మేయర్ బెవర్లీ వాలింగ్‌ జాత్యహంకార వ్యాఖ్యలను సమర్థిస్తూ.. చాలా బాగా చెప్పావంటూ కామెంట్ చేసింది. అయితే దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో.. ఆపై ఫేస్ బుక్ పోస్టును తొలగించుకున్నారు టేలర్.

“APE IN HEELS” – CLAY COUNTY OFFICIAL PAMELA RAMSEY TAYLOR ISSUES SHADY APOLOGY FOR HER RACIST MICHELLE OBAMA POST

కానీ అప్పటికే ఆ పోస్టును చాలామంది షేర్ చేయడంతో.. సోషల్ మీడియాలో దీనిపై భారీ చర్చ జరిగింది. టేలర్ వ్యాఖ్యలను నిరసిస్తూ.. దాదాపు 14వేల మంది సంతకాలు సేకరించి.. ఆమెపై పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పమేలా టేలర్, బెవర్లీలు క్షమాపణ చెప్పక తప్పలేదు. అనంతరం వీరివురి ఫేస్ బుక్ ఖాతాలను రద్దు చేశారు. క్లే కౌంటీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పదవి నుంచి కూడా పమేలా టేలర్ ను తొలగించి.. ఆమె స్థానంలో లెస్లీ మెక్‌గ్లొతిన్‌ అనే మరో యువతికి బాధ్యతలు అప్పగించారు.

ఇదిలా ఉంటే, అమెరికా సెన్సస్ డేటా వివరాల ప్రకారం.. క్లే కౌంటీ జనాభాలో ప్రతీ మంది పౌరుల్లో ఇద్దరు ఆఫ్రికన్-అమెరికన్లే కావడం గమనార్హం. వీరిలో దాదాపు మూడింట నాలుగొంతుల మంది అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వైపే నిలిచారు. మొత్తానికి మిషెల్లీపై జాత్యహంకార వ్యాఖ్యలకు భారీ మూల్యమే చెల్లించుకున్నారు పమేలా టేలర్.

English summary
She apologized however, for how people might view the post and demanded that it should not be shared and commented on any longer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X