వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఐఫోన్‌ ఎక్స్’లో.. అద్భుతమైన ఫీచర్‌ ఏమిటో తెలుసా?

టెక్ దిగ్గజం ఆపిల్‌ తన పదో వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘ఐఫోన్‌ ఎక్స్’ లో అద్బుతమైన ఫీచర్ ఏమిటో మీకు తెలుసా? ‘ఫేస్ ఐడీ’ ఫీచర్. అవును, ఆపిల్ లేటెస్ట్ ఫోన్ లో ఈ ఫీచర్ అందరినీ అబ్బురపరుస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: టెక్ దిగ్గజం ఆపిల్‌ తన పదో వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన 'ఐఫోన్‌ ఎక్స్' లో అద్బుతమైన ఫీచర్ ఏమిటో మీకు తెలుసా? 'ఫేస్ ఐడీ' ఫీచర్. అవును, ఆపిల్ లేటెస్ట్ ఫోన్ లో ఈ ఫీచర్ అందరినీ అబ్బురపరుస్తోంది.

భారత్‌లో ఈనెల 3వ తేదీ నుంచి 'ఐఫోన్ ఎక్స్' వినియోగదారులకు లభించనుంది. అనేక అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.89 వేలు. గతంలో ఉన్న ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ స్థానంలో ఇందులో తొలిసారిగా 'ఫేస్‌ ఐడీ' ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.

iphone-x-face-id

ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌తో పోలిస్తే 'ఫేస్‌ ఐడీ'లో తప్పిదాలు జరిగే అవకాశం తక్కువేనంటోంది ఆపిల్‌. అత్యంత భద్రంగా భావించే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ సదుపాయంలో 50 వేల సందర్భాల్లో ఒకసారి తప్పు జరిగే ఆస్కారముంటే.. ఫేస్ ఐడీలో 10 లక్షల సార్లలో ఒకసారి మాత్రమే తప్పిదానికి ఆస్కారముంటుందట.

అది కూడా ఎప్పుడంటే.. అచ్చం మీలాగే ఉండే వ్యక్తి, ఒకే డీఎన్‌ఏ కలిగిన కవలలు మాత్రం ఐఫోన్‌ ఎక్స్ లోని ఫేస్ ఐడీ ఫీచర్ ను పక్కదారి పట్టించొచ్చని ఆపిల్‌ చెబుతోంది. విశేషం ఏమిటంటే.. ఆఫిల్ ఐఫోన్ ఎక్స్ లో ఉన్న ఈ ఫేస్ ఐడీ ఫీచర్ చీకటిలోనూ, అత్యంత వెలుతురులోనూ వినియోగించుకోవచ్చు.

ఒకవేళ ఫోన్‌ ను అన్‌లాక్‌ చేసే సమయంలో టోపీగానీ, కళ్లద్దాలు గానీ ధరించినా, ఫోన్‌లో ఉండే ముందు కెమెరా మిమ్మల్ని గుర్తిస్తుందట. ఒకవేళ ఫేస్‌ ఐడీ గుర్తించకపోతే పాస్‌కోడ్‌తో ఫోన్‌ను అన్‌లాక్‌ చేయొచ్చు. దీనికోసం ఫేస్‌ ఐడీని క్రియేట్‌ చేసేటప్పుడే పాస్‌కోడ్‌ను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి గతంలోని మోడల్స్ కన్నా ఐఫోన్ ఎక్స్ మరింత సురక్షితం అన్నమాట.

English summary
Apple iPhone X (iPhone 10) will go on sale from November 3. In India, the starting price for iPhone X will be Rs 89,000. One of the highlights of the Apple iPhone X is that it doesn’t have TouchID, instead it comes with Face ID. This is a new form of biometric recognition to unlock the device. Like the Samsung Galaxy Note 8, S8 series, the iPhone X will recognise a user’s face and unlock the iPhone. But how secure is Face ID on Apple iPhone X? How will Apple deal with privacy issues when it comes to storing such information? The company had put out a detailed paper explaining the security features with Apple Face ID in September this year. Here’s a detailed look at some questions and answers around Apple iPhone X’s Face ID feature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X