• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డ్యుయల్ సిమ్ ఆప్షన్‌తో.. అత్యంత తక్కువ ధరకే ఐఫోన్.. నిజమేనా!?

By Ramesh Babu
|

వాషింగ్టన్: ఆపిల్‌ ఐఫోన్‌కు స్మార్ట్‌ఫోన్ ప్రియుల్లో ఉన్న క్రేజే వేరు. ఆపిల్ నుంచి ఏ కొత్త ఉపకరణం విడుదలైనా దానిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలో గతేడాది దశాబ్ది కానుకగా విడుదల చేసిన ఐఫోన్ ఎక్స్‌పై ఆపిల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఈ ఫోన్‌ అమ్మకాలు ఆశించినంతగా జరగలేదు.

కారణం.. ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ ధర మరీ ఎక్కువగా ఉండటమే. ఈ ఫోన్‌కు నిర్ణయించిన ధరే దాని అమ్మకాలు తగ్గడానికి కారణమని ఆపిల్ విశ్లేషణలో కూడా తెలియవచ్చింది. దీంతో ఈ ఏడాది విడుదల చేయనున్న కొత్త ఐఫోన్ మోడల్‌ను అత్యంత తక్కువ ధరకే విడుదల చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.

కొత్త ఐఫోన్‌ మోడల్స్ కోసం ఇప్పట్నించే...

కొత్త ఐఫోన్‌ మోడల్స్ కోసం ఇప్పట్నించే...

ఆపిల్ సంస్థ ఏటా విడుదల చేసే ఐఫోన్‌ల కోసం స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అయితే ఈసారి విడుదల కానున్న ఐఫోన్ మోడల్స్ కోసం ఇంకా ఎక్కువ ఆసక్తితో ఉన్నారని సమాచారం. ఎందుకంటే ఈసారి మొత్తం మూడు మోడల్స్ విడుదల కానున్నాయి. వీటిలో ఒకటి- అత్యంత పెద్దదైన ఐఫోన్ కాగా, రెండోది- గతంలో విడుదలైన ఐఫోన్ ఎక్స్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్, ఇక మూడోది- బడ్జెట్ ఐఫోన్ విత్ డ్యుయల్ సిమ్ ఫీచర్‌.

డ్యూయల్ సిమ్‌ ఆప్షన్‌తో ఐఫోన్...

డ్యూయల్ సిమ్‌ ఆప్షన్‌తో ఐఫోన్...

ఆపిల్ కంపెనీ ఈసారి డ్యూయల్ సిమ్ సదుపాయం కలిగిన ఐఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే చాలామందికి రెండు మొబైల్ నంబర్లు ఇప్పుడు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో విడివిడిగా ఫోన్లు కొనడం కంటే డ్యూయల్ సిమ్ సదుపాయం ఉన్న ఫోన్లను కొనేందుకే మొగ్గుచూపుతుంటారు. ఈ విషయాన్ని ఆపిల్ చాలా ఆలస్యంగా అర్థం చేసుకుంది. తన తాజా ఐఫోన్‌ను డ్యూయల్ సిమ్ సదుపాయంతో విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

తక్కువ ధరకే ఐఫోన్...

తక్కువ ధరకే ఐఫోన్...

ఆపిల్ ఐఫోన్‌పై ఎంత మోజు ఉన్నా దాన్ని కొనాలంటే మాత్రం కాస్త జంకుతారు. దీనికి కారణం ఆ ఫోన్ ధర. ఆ మధ్య విడుదలైన ఐఫోన్ ఎక్స్‌లో ఎన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ దాని ధర దానికి దెబ్బేసిందనే చెప్పాలి. అందుకే ఆ ఫోన్ అమ్మకాలు ఆశించినంతగా లేవు. ఈ విషయాన్ని పసిగట్టిన ఆపిల్ ఈసారి అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ విడుదల చేయాలని భావిస్తోందట.

ధర తక్కువైనా, ఫీచర్లు ఎక్కువే...

ధర తక్కువైనా, ఫీచర్లు ఎక్కువే...

అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ విడుదల అనగానే ‘అబ్బే.. అందులో ఏం ఉండవు..' అని నోరు చప్పరించనక్కర్లేదు. ఈసారి ఆపిల్ కంపెనీ విడుదల చేసే ఐఫోన్ కొత్త మోడల్‌లో గరిష్టంగా ఐఫోన్ ఎక్స్‌లో ఉండే అన్ని ఫీచర్లను కొత్తగా విడుదల కానున్న ఐఫోన్‌లో ఇవ్వనున్నట్లు తెలిసింది. దీంతో ఐఫోన్ కొత్త మోడల్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

 బడ్జెట్ ఐఫోన్‌లో ఏమేం ఉంటాయంటే...

బడ్జెట్ ఐఫోన్‌లో ఏమేం ఉంటాయంటే...

ఆపిల్ కొత్తగా విడుదల చేయనున్న బడ్జెట్ ఐఫోన్‌లో ఎల్‌ఈడీ డిస్‌ప్లేకు బదులుగా సంప్రదాయ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఫోన్ బాడీ అల్యూమినియంతో కాకుండా ప్లాస్టిక్‌తో తయారవుతుందని, డిస్‌ప్లే టైప్ ఎడ్జ్ టు ఎడ్జ్ మాదిరి ఉంటుందని, డిస్‌ప్లే సైజ్ 6.5 అంగుళాల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. దీనివల్ల ఫోన్ ధర బాగా తగ్గుతుందని, దాంతో ఆ ఫోన్ పట్ల యూజర్లు ఆసక్తిని ప్రదర్శించే అవకాశం ఉందని యాపిల్ భావిస్తున్నట్లు సమాచారం.

 ఊహాగానాలేనా? నిజమవుతాయా?

ఊహాగానాలేనా? నిజమవుతాయా?

బడ్జెట్ ఐఫోన్‌తోపాటు ఐఫోన్ ఎక్స్‌ను పోలిన ఉండే మరో హై ఎండ్ ఫోన్‌ను కూడా ఆపిల్ ఈ ఏడాది విడుదల చేయనున్నట్లు సమాచారం. దీని డిస్‌ప్లే సైజ్ 5.8 అంగుళాలు ఉండొచ్చని అంటున్నారు. అయితే బడ్జెట్ ఐఫోన్‌కు సంబంధించి ప్రస్తుతానికి ఇవన్నీ ఇంటర్నెట్ ప్రపంచంలో వినిపిస్తోన్న ఊహాగానాలే. చివరకు మరి వీటిలో ఏ ఫీచర్లతో ఆపిల్ తన ఐఫోన్‌ను కొత్త మోడల్‌ను విడుదల చేస్తుందో వేచి చూస్తేనే తెలుస్తుంది.

English summary
Apple is preparing to release a trio of new smartphones later this year: the largest iPhone ever, an upgraded handset the same size as the current iPhone X and a less expensive model with some of the flagship phone’s key features. With the new lineup, Apple wants to appeal to the growing number of consumers who crave the multitasking attributes of so-called phablets while also catering to those looking for a more affordable version of the iPhone X, according to people familiar with the products. Apple, which is already running production tests with suppliers, is expected to announce the new phones this fall. The plans could still change, say the people, who requested anonymity to discuss internal planning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X