వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కిన్ క్యాన్సర్‌ను స్మార్ట్ ఫోన్ పసిగట్టేయగలదనే విషయం మీకు తెలుసా..?

|
Google Oneindia TeluguNews

సాధారణ సమయంలో కంటే వేసవి కాలంలో ఎండవేడిమికి సూర్య కిరణాలు మన చర్మాన్ని నేరుగా తాకుతాయి. దీంతో స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ సమయం వరకు మనకు స్కిన్ క్యాన్సర్ వచ్చినట్లు పసిగట్టలేం. కానీ అలాంటి ప్రమాదకర క్యాన్సర్‌లను మన స్మార్ట్ ఫోన్ ఇట్టే పసిగడుతుందన్న విషయం మీకు తెలుసా..? అవును ఇది నిజం.. మనం నిత్యం వినియోగించే స్మార్ట్‌ఫోన్లే స్కిన్ క్యాన్సర్ ఉందో లేదో చెప్పేస్తాయని ఓ నివేదిక బయటకొచ్చింది.

స్కిన్ క్యాన్సర్‌ను గుర్తించే యాప్స్

స్కిన్ క్యాన్సర్‌ను గుర్తించే యాప్స్

స్కిన్ క్యాన్సర్‌ను ఎంత తొందరగా పసిగడితే అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు స్కిన్ క్యాన్సర్ ఉందో లేదో అనేది పసిగట్టడం ఒక పుట్టుమచ్చను గుర్తించినంత ఈజీగా ఉంటుందట. స్కిన్ క్యాన్సర్‌ను పసిగట్టేందుకు పలు రకాల యాప్‌లు వచ్చాయి. ఇవి చర్మ వ్యాధులను ఇట్టే గుర్తిస్తాయి. ఈ యాప్‌ల వల్ల ఇక డాక్టరు దగ్గరకు వెళ్లి చెక్ చేసుకుని పరీక్షలు నిర్వహించి ఆ రిపోర్టు వచ్చే వరకు చాలా సమయం పడుతుంది. ఈ యాప్‌లతో సింపుల్‌గా అయిపోతుంది పైగా సమయం ఆదా అవుతుంది. అయితే దీనిపైనే 100శాతం ఆధారపడలేమని కూడా ఆ నివేదిక వెల్లడిస్తోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథంతో పనిచేసే యాప్స్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథంతో పనిచేసే యాప్స్

ప్రస్తుతం టెలీమెడిసిన్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. స్కిన్ క్యాన్సర్‌ను పసిగట్టేందుకు పలు యాప్స్ మన స్మార్ట్ ఫోన్‌లో లభిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథం ఆధారంగా ఈ యాప్‌లు పనిచేసి శరీరంపై ఉన్న రుగ్మతులను గుర్తిస్తాయి. శరీరం మీద ఏదైనా మచ్చలుంటూ ఆ యాప్ ఫోటోలు తీసి డెర్మిటాలజిస్టుకు పంపుతుంది. ఇది వెంటనే జరిగిపోతుంది. ఆ తర్వాత డెర్మటాలజిస్ట్ అప్పాయింట్‌మెంట్ కూడా ఫిక్స్ చేసేస్తూ స్కిన్ చెక్ చేయించుకోవాల్సిందిగా గుర్తు చేస్తాయట ఈ యాప్స్.

స్కిన్ క్యాన్సర్‌ను పసిగట్టే యాప్‌లు ఇవే..!

స్కిన్ క్యాన్సర్‌ను పసిగట్టే యాప్‌లు ఇవే..!

మైఐస్కిన్(Miiskin):శరీరంపై ఉన్న మచ్చలను ఈ యాప్ అనలైజ్ చేస్తుంది. ఇందులో హై డిఫినిషన్ కెమెరా ఉండటం వల్ల తీసే ఫోటో కూడా పూర్తి క్లారిటీతో వస్తుంది. తీసిన ఫోటోను ఫోనులోని ఓ ప్రత్యేక ఫోల్డర్‌లో స్టోర్ చేస్తుంది. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ మీరు ఆ ఫోటోలో ఉన్న మచ్చలను... ప్రస్తుతం ఉన్న మచ్చలను పోల్చి చూసుకోవచ్చు. ఒకవేల మార్పులు ఉంటే ఈ యాప్ మిగతా శరీరంలోని మచ్చలను కూడా స్కాన్ చేసి డెర్మిటాలజిస్ట్ ఏదైతే పరీక్షలు నిర్వహిస్తారో ఈ యాప్ కూడా అదే చేస్తుంది. ఇక ఈ యాప్‌తో పాటు మరిన్ని యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. యూఎంస్కిన్ చెక్ (UMSkinCheck), మోల్ స్కోప్ (MoleScope), స్కిన్ విజన్ (SkinVision)లాంటి యాప్‌లు ఉన్నాయి.

English summary
During summers, we are exposed more than usual to the harsh UV rays of the sun. This can lead to skin cancer, which accounts for more diagnoses each year than all other cancers.Several smartphone apps have come which make self-examination of skin abnormalities easier. It saves us the trouble of going to a doctor, although one can’t be 100 per cent reliant on these apps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X