వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

13వేల ఏళ్ల క్రితమే: ఇజ్రాయెల్లో ప్రపంచ అతిపురాతన బీరు గుర్తించారు

|
Google Oneindia TeluguNews

ఇజ్రాయెల్: దాదాపు 13వేల ఏళ్ల క్రితమే బీరును వినియోగించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇజ్రాయెల్లోని ఓ గుహలో బీరుకు సంబంధించిన ఆనవాళ్లను వారు గుర్తించారు. ఇప్పటి వరకు ఇది అతి పురాతన బీరు. దీంతో వేల సంవత్సరాల క్రితమే బీరు తయారీ, వినియోగం ఉందని తేల్చారు.

గతంలో తాము అంచనా వేసిన దానికంటే ఐదు వేల ఏళ్లకు ముందే బీరు వినియోగానికి సంబంధించిన ఆనవాళ్లు లభించినట్లు తెలిపారు. ఇజ్రాయెల్లోని హైఫా సమీపంలో ఆల్కహాల్‌ ఉత్పత్తికి సంబంధించిన ఆనవాళ్లను పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Archaeologists discover 13,000 year old brewery in Israel

అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, ఇజ్రాయెల్‌లోని హైఫా యూనివర్సిటీకి చెందిన పురాతత్వ శాస్త్రవేత్తలు పరిశోధనలో పాల్గొన్నారు. ఇజ్రాయెల్‌లో పదమూడు వేల ఏళ్ల క్రితం నాటి నాటుఫియన్‌ గుహలో లభించిన మూడు రోళ్లను విశ్లేషించారు.

వీటిని బీరు తయారు కోసం వినియోగించేవారని గుర్తించారు. గతంలో పురాతన మానవులు ఉత్తర చైనాలో బీరు ఉత్పత్తి చేశారని గుర్తించారు. ఇది అంతకంటే ఐదువేల సంవత్సరాలకు ముందేనని తేలింది.

English summary
Researchers say they have found the world's oldest brewery, with residue of 13,000 year old beer, in a prehistoric cave near Haifa in Israel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X