వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థి కాల్పులు: ఇద్దరి మృతి, 20 మంది బందీలు

By Pratap
|
Google Oneindia TeluguNews

మాస్కో: ఓ హైస్కూల్ విద్యార్థి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒక టీచర్, పోలీసు అధికారి మృతి చెందారు. తరువాత తరగతి గదిలోకి ప్రవేశించి 20 మంది విద్యార్థులను నిర్బంధించాడు. కొద్ది రోజుల్లో వింటర్ ఒలింపిక్స్ జరగనుండగా సోమవారం చోటుచేసుకున్న ఘటన ఆందోళన కలిగింది.

ఉత్తర మాస్కోలోని ఓ పాఠశాల బయోలజీ క్లాస్ రూమ్‌లోకి పిస్టల్‌తో వచ్చిన విద్యార్థి భీతావహ వాతావరణాన్ని సృష్టించాడు. కాల్పుల్లో ముందుగా ఓ పోలీసు అధికారి చనిపోయినట్టు లైఫ్‌న్యూస్ వెబ్‌సైట్ వెల్లడించింది. తరగతి గదిలోకి వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరపగా టీచర్ మృతి చెందారు.

Russia flag

క్లాసులో ఉన్న ఇరవై మంది విద్యార్థులు, ఒక టీచర్‌ను నిర్బంధించాడని రష్యా అంతరింగక భద్రతా మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఆండ్రీ ఫిలిప్చుక్ తెలిపారు. అగంతకుడిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. పరిస్థితి సద్దుమణిగిన తరువాత విద్యార్థులను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు.

ఈ ఆపరేషన్‌లో ఒక పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు. మరొక అధికారి ఆసుప్రతిలో చనిపోయినట్టు న్యూస్‌లైన్ పేర్కొంది. మాస్కోలోని స్కూల్ నెంబర్ 263లో ఈ ఘటన జరిగిందన్నారు. కాల్పులతో భయాందోళనకు గురైన డజన్లకొద్ది విద్యార్థులు బయటకు పరుగులు తీశారు.

English summary
All the students from Moscow secondary school number 263 in northeast Moscow that an armed teenager took hostage on Monday have been freed, while a policeman and a teacher were killed in a shootout, the Russian interior ministry told ITAR-TASS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X